Balakrishna Movie: బాలయ్య సినిమా చిత్రీకరణకు బ్రేక్‌.. కారణం ఇదే

Balakrishna Movie: నందమూరి బాలకృష్ణ సినిమా చిత్రీకరణకు గ్రామస్తులను నుంచి నిరసన సెగ తగిలింది.

Samba Siva Rao
Published on: 22 Feb 2021 10:46 AM IST
Balakrishna Movie BB3
X

బాలకృష్ణ మూవీ ఫైల్ ఫోటో 

Balakrishna Movie: నందమూరి బాలకృష్ణ సినిమా చిత్రీకరణకు గ్రామస్తులను నుంచి నిరసన సెగ తగిలింది. బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రి 'గాడ్ ఫాదర్' షూటింగ్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారు. శనివారం వికారాబాద్‌ మండలం కొటాలగుడెం గ్రామంలో సినిమాను చిత్రీకరించేందుకు వెళ్లారు. సిినిమా చిత్రీకరణ ప్రాంతానికి వెళ్లి కొటాలగూడ గ్రామస్తులు అభ్యతరం వ్యక్తం చేశారు. సినిమా షూటింగ్‌ను అడ్డగించడంతోపాటు తమ పంట పొలాలు దెబ్బతింటున్నాయని వాపోయారు.

ద్వారక క్రియేషన్స్‌ ప్రొడక్షన్స్‌లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న చిత్రం "గాడ్ ఫాదర్". ఈ సినిమా చిత్రీకరణ కొంతవరకు పూర్తయ్యింది. మిగతా షూటింగ్ కోసం వికారాబాద్ వెళ్లగా.. గ్రామాభివృద్ధికి సహాయం చేస్తేనే చిత్రీకరణకు అనుమతిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. చిత్రీకరణకు అన్ని అనుమతులు ఉన్నాయని చిత్రబృదం వెల్లడించిన గ్రామస్థులు వినలేదు. దాంతో చేసేది లేఖ యూనిట్ సభ్యులు అక్కడ నుండి వెనక్కు వెళ్లి పోయారు.

బాలకృష్ణ ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా సయేశా సైగల్ నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి 'గాడ్ ఫాదర్' అనే పవర్ ఫుల్ టైటిల్ని ఫిక్స్ చేశారు. న్టీ రామారావు జన్మదినమైన మే 28న ఈ సినిమా విడుదల కానుంది. ద్వారకా క్రియేషన్స్ పతాకం పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story