Balakrishna Movie: బీబీ3 టైటిల్ ఫిక్స్

బాలకృష్ణ, బోయపాటిల మూడో చిత్రానికి టైటిల్ ఖరారు. మే 28న విడుదల కానున్న చిత్రం

Venkata Chari
Published on: 19 Feb 2021 3:53 PM IST
Balakrishna and boyapati new bb3 movie title announced
X
బాలకృష్ణ ఫైల్ ఫోటో 

బాలకృష్ణ నుంచి ఓ సినిమా వస్తోందంటే అభిమానులకు పండుగే. అందులోనూ బాలయ్య బాబు, బోయపాటి కాంబినేషన్ లో వస్తుందంటే ఆ చిత్రానికి వుండే క్రేజ్ చెప్పన్నక్కర్లేదు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలూ బాక్సాఫీసు వద్ద భారీ హిట్స్ ను సొంతం చేసుకున్నాయి. దీంతో బీబీ3 పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

సినిమా టైటిల్ పై మొదటి నుంచీ రకరకాల పేర్లు ప్రచారంలోకి ఉన్నాయి. ఇంకా పేరు ఖరారు చేయలేదంటూ దర్శక నిర్మాతలు ఎప్పటికప్పుడు ప్రకటింస్తూనే ఉన్నారు. తాజాగా ఈ చిత్రానికి 'గాడ్ ఫాదర్' అనే పవర్ ఫుల్ టైటిల్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ బాలక్భష్ణ కు సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారట. అందుకే, దీనిని ఖరారు చేసినట్టు, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఈ చిత్రంలో బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపిస్తారని, ఆ గెటప్ సినిమాకి హైలైట్ అవుతుందని అంటున్నారు. వాటితోపాటు బోయపాటి బ్రాండ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయని టాక్. ఎన్టీ రామారావు జన్మదినమైన మే 28న ఈ సినిమా విడుదల కానుంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Venkata Chari

Venkata Chari

Next Story