Top
logo

మూడు తరాల కొణిదెల కోడళ్లు..

మూడు తరాల కొణిదెల కోడళ్లు..
Highlights

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అభిమానులు సంబరంగా జరుపుకుంటున్నారు. ఇక సినీ వర్గాలు సోషల్ మీడియాలో తమ శుభాకంక్షల సందేశాలతో చిరంజీవిని పలకరిస్తూనే ఉన్నారు

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అభిమానులు సంబరంగా జరుపుకుంటున్నారు. ఇక సినీ వర్గాలు సోషల్ మీడియాలో తమ శుభాకంక్షల సందేశాలతో చిరంజీవిని పలకరిస్తూనే ఉన్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా అందరూ చిరంజీవికి శుభాకంక్షల సందేశాలు పంపారు. ఇప్పుడు కొణిదెల వారి కోడల్ని అంటూ లేటుగా అయినా లేటెస్ట్రా గా రామ్ చరణ్ భార్య ఉపాసన తన శుభాకాంక్షల సందేశాన్ని ట్వీట్ చేశారు. రెండు ఫొటోలతో తన సందేశాన్ని పంచుకున్నారామె. మొదటి ఫోటోలో చిరంజీవి, అయన సతీమణి సురేఖ, ఉపాసన లతో రామ్ చరణ్ తీసిన సేల్ఫీ.. ఇక రెండో ఫోటో ఒకింత స్పెషల్ అనే చెప్పొచ్చు. మూడు తరాల కొణిదెల కోడళ్లు అంటూ క్యాప్షన్ ఇచ్చిన ఆ ఫోటోలో ఉపాసన, ఆమె అత్త-చిరంజీవి భార్య సురేఖ, సురేఖ అత్త అంటే చిరంజీవి తల్లి ముగ్గురూ ఉన్న ఫోటో షేర్ చేశారు ఉపాసన. ఇప్పుడు ఈ ట్వీట్ అభిమానుల్లో వైరల్ అవుతోంది. మూడు తరాల కొణిదెల కోడళ్ళను చూసి మురిసిపోతున్నారు అభిమానులు.Next Story

లైవ్ టీవి


Share it