భవిష్యత్తు ఓటీటీదే అయితే సినిమాలు ఎలా తీయాలి.. టాప్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

భవిష్యత్తు ఓటీటీదే అయితే సినిమాలు ఎలా తీయాలి.. టాప్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
x
Shankar (File Photo)
Highlights

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావంతో గత రెండున్నర నెలలుగా థియేటర్స్ మల్టీప్లెక్సెస్ మూత పడ్డాయి. దీంతో సినిమాల విడుదల ఆగిపోయాయి. అయితే థియేటర్స్...

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావంతో గత రెండున్నర నెలలుగా థియేటర్స్ మల్టీప్లెక్సెస్ మూత పడ్డాయి. దీంతో సినిమాల విడుదల ఆగిపోయాయి. అయితే థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ చేస్తారో లేదో అనే సందిగ్ధంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ తమ చిత్రాలను డైరెక్టుగా ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.

కానీ స్టార్ హీరోల సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు ఏవీ ఓటీటీ రిలీజ్ కాలేదు. ఈ విషయంపై దర్శకుడు శంకర్ స్పందించారు. థియేటర్ లో సినిమా చూసిన ఆనందాన్ని ఓటీటీ ఇవ్వలేదని, ఓటీటీదే భవిష్యత్తు అయితే నేను సినిమాలు ఎలా తీయాలి అని ప్రశ్నించారు. ఇక సినిమాల విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుందని.. ఈ నేపథ్యంలో ఎలాంటి సినిమాలు తీయాలో అర్ధం కావడం లేదు. థియేటర్ అయినా ఓటీటీ అయినా నా సినిమాలు అన్ని రకాల ఆడియన్స్ ని అలరిస్తాయని అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నిర్మాతలకు నష్టాలు రానంతవరకు సినిమాలు ఓటీటీలో విడుదలవడం మంచిదేనని పేర్కొన్నారు.

ప్రస్తుతం శంకర్ లోకనాయకుడు కమల్ హాసన్ తో 'ఇండియన్ 2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మూవీలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయన్లుగా నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాష్ కరణ్ నిర్మిస్తున్నారు.1996లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ గా వస్తోంది. ఈ షూటింగ్ వాయదా పడింది.


Show Full Article
Print Article
Next Story
More Stories