విజయ్ 'మాస్టర్' టీజర్ రికార్డుల మోత!

విజయ్ మాస్టర్ టీజర్ రికార్డుల మోత!
x
Highlights

జేవియర్ బ్రిట్టో తన సొంత బ్యానర్ ఎక్స్ బి ఫిల్మ్ క్రియేటర్స్ నిర్మించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయనున్నారు మేకర్స్.

తమిళ దళపతి విజయ్ నటించిన 'మాస్టర్' సినిమా టీజర్ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. మాస్టర్ మూవీ టీజర్ యూ ట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. ఈ నెల 14న విడుదలైన మాస్టర్ టీజర్, రెండు వారాలలోపే 40 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంతేకాదు16 గంటల్లోనే 1.6 మిలియన్లకు పైగా లైక్‌లతో యూ ట్యూబ్‌లో ఎక్కువ లైక్స్ సొంతం చేసుకున్న టీజర్‌లలో ఒకటిగా నిలిచినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో కాలేజీ ప్రొఫెసర్ పాత్రలో విజయ్ కనిపిస్తున్నాడు.

జేవియర్ బ్రిట్టో తన సొంత బ్యానర్ ఎక్స్ బి ఫిల్మ్ క్రియేటర్స్ నిర్మించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయనున్నారు మేకర్స్. ఇంటర్నెట్‌లో టీజర్ హిట్ కావడంతో విజయ్‌ అభిమానులు పొంగల్‌ పండగను ముందే జరుపుకుంటున్నారు. ఇక ఇందులో విజయ్ సరసన మాళవిక మోహనన్న హీరోయిన్ గానటిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి.

ఇక ఇదిలా ఉంటే విజయ్ 65 వ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించుకుంది సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2021 లో సెట్స్‌ పైకి తీసుకు వెళ్లే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories