భారీ అంచనాలను పెంచేసిన విజయ్‌ 'మాస్టర్‌' టీజర్‌..

భారీ అంచనాలను పెంచేసిన విజయ్‌ మాస్టర్‌ టీజర్‌..
x
Highlights

తమిళ స్టార్‌ హీరోలు విజయ్‌ దళపతి , విజయ్‌ సేతుపతిల కలిసి నటిస్తున్న తాజా చిత్రం "మాస్టర్‌".. లోకేష్‌ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి

తమిళ స్టార్‌ హీరోలు విజయ్‌ దళపతి , విజయ్‌ సేతుపతిల కలిసి నటిస్తున్న తాజా చిత్రం "మాస్టర్‌".. లోకేష్‌ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీపావళి సందర్బంగా సినిమకి సంబంధించిన టీజర్ ని కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్.. విజయ్‌ దళపతిను జేడిగా పరిచయం చేస్తూ చిత్ర టీజర్‌ మొదలైంది.

సినిమా టీజర్ చూస్తుంటే ఇందులో విజయ్‌ ఓ కాలేజీ ప్రొఫెసర్‌గా కనిపించనున్నాడని అర్ధం అవుతుంది. ప్రొఫెసర్‌గా ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా మద్యానికి బానిసైన తనకు తానే రాజు ఫీల్ అయ్యేలాగా విజయ్ క్యారెక్టర్ కనిపిస్తుంది. అంతేగాక క్యాంపస్‌ లోపల విద్యార్థులకు, విజయ్‌ దళపతిలకి మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతుండగా అవి పెద్దగా అయి వీధీ రౌడీలు కూడా కలుగజేసుకునేంతగా మారుతాయి.

ఈ క్రమంలో విజయ్‌ సేతుపతి ఎంట్రీ అవ్వడం, ఇద్దరి మధ్య ఫైట్ సీన్ ఉన్నట్టుగా దర్శకుడు చూపించి సినిమా పైన మరింత ఆసక్తిని పెంచాడు. ఇద్దరు స్టార్ హీరోలు ఇందులో నటిస్తుండడంతో సినిమా పైన పీక్స్ లోకి వెళ్ళిపోయాయి.. ఇక ఇందులో హీరో విజయ్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ అదరగొట్టాడు. విజయ్ సరసన మాళవిక మోహనన్న నటిస్తోంది. అనిరుధ్ అందించిన సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే సినిమాని రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories