SP Jananathan: స్టార్ డైరెక్టర్ కన్నుమూత..శృతిహాసన్ భావోద్వేగ ట్వీట్

SP Jananathan: తమిళ స్టార్ డైరెక్టర్ ఎస్పీ జననాథన్ (61) కన్నుమూశారు.

Samba Siva Rao
Updated on: 14 March 2021 4:16 PM IST
kollywood director dies
X

 జననాథన్ (ట్విట్టర్ ఇమేజ్ )

SP Jananathan: తమిళ స్టార్ డైరెక్టర్ ఎస్పీ జననాథన్ (61) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రితో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఎస్పీ జననాథన్ మృతితో కోలివుడ్ ఇండస్ట్రీ అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ తారలు ఆ‍యన మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జననాథన్ తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, శృతి హాసన్ జంటగా నటిస్తున్న లాభం మూవీకి దర్వకత్వం వహిస్తున్నారు. ఎడిటింగ్ పనుల అనంతరం భోజనం కోసం జననాథన్ ఇంటికి వెళ్లారు. అక్కడే అపస్మారక స్థితికి వెళ్లారు. దాంతో వెంటనే ఆయన అసిస్టెంట్స్ ఆస్పత్రికి తరలించారు.

జననాథన్ మెదడులో రక్తం గడ్డ కట్టడం గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విజయ్ సేతుపతి 'లాభం' అనే సినిమా సమ్మర్‌లో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగానే జరుగుతున్నాయి. విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర ఎడిటింగ్ పనుల్లో నిమగ్నమైయ్యారు. 2003లోనే జననాథన్ జాతీయ అవార్డు సొంతం చేసుకున్నాడు. 2003లో జననాథన్ దర్శకత్వం వహించిన 'ఇయర్కై' సినిమా ఆ ఏడాదికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది.

జననాథన్ తమిళంలో నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. జననాథన్ తెరకెక్కించిన తాజా చిత్రం లాభంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. తెలుగు నటుడు జగపతిబాబు ప్రతినాయకుడిగా పాత్ర పోషిస్తున్నాడు. జననాథన్ మృతిపట్ల టాలీవుడ్ నటుడు జగపతిబాబు కూడా దిగ్బ్రాంతి వ్యక్తం చేశాడు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపాడు.

జననాథన్ మృతి పట్లా హీరోయిన్ శృతి హాసన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. మీ దర్శకత్వంలో పని చేయడం చాలా ఆనందంగా ఉంది సర్ థాంక్యూ..మీ మాటలు ఎల్లప్పుడూ స్ఫూర్తి నింపాయి.. మీరు ఎప్పుడూ మా ఆలోచనలలో ఉంటారు! .. మీ కుంటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్న అంటూ శృతి ట్వీట్ చేసింది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story