Kollywood: క్రేజీ కాంబినేషన్‌.. అజిత్‌ను డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో

Kollywood: క్రేజీ కాంబినేషన్‌.. అజిత్‌ను డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో
x

Kollywood: క్రేజీ కాంబినేషన్‌.. అజిత్‌ను డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో

Highlights

Kollywood: దర్శకుడిగా మారిన అతికొద్ది మంది నటుల్లో ధనుష్‌ ఒకరు. తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసే ధనుష్‌ దర్శకత్వంలోనూ తన సత్తా చాటారు.

Kollywood: దర్శకుడిగా మారిన అతికొద్ది మంది నటుల్లో ధనుష్‌ ఒకరు. తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసే ధనుష్‌ దర్శకత్వంలోనూ తన సత్తా చాటారు. అతని దర్శకత్వంలో వచ్చిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రంతో ధనుష్‌ సోదరి కుమారుడు పవిష్ హీరోగా పరిచయమయ్యాడు. ప్రేమకథా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా 2025 ఫిబ్రవరి 21న విడుదలై మంచి స్పందన అందుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా ధనుష్‌ మరో భారీ సినిమాను ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ధనుష్‌ దర్శకత్వంలో అజిత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వండర్‌బార్ ఫిల్మ్స్ నిర్మించనుందని, సంగీతం అనిరుధ్ అందించనున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. అజిత్ ప్రస్తుతం కార్ రేసింగ్‌లో పాల్గొననున్న నేపథ్యంలో, ఈ సినిమా షూటింగ్ 2025 అక్టోబర్ లేదా డిసెంబర్‌లో మొదలయ్యే అవకాశం ఉందని టాక్. ధనుష్ ఇప్పటికే ‘పవర్ పాండి’ సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అలాగే, అతని దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాయన్’ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. మరి అజిత్‌ను ధనుష్‌ నిజంగానే డైరెక్ట్‌ చేయనున్నారా.? ఈ సినిమా నిజంగానే కార్యరూపం దాల్చుతుందా.? తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories