పెళ్లి గురించి మాట్లాడిన సామ్​.. ఎత్తుకుని హంగామా చేసిన అక్షయ్‌ కుమార్‌

Akshay Kumar Spins Samantha Ruth Prabhu in Koffee With Karan
x

పెళ్లి గురించి మాట్లాడిన సామ్​.. ఎత్తుకుని హంగామా చేసిన అక్షయ్‌ కుమార్‌

Highlights

Samantha Bollywood: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఇప్పుడు బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే.

Samantha Bollywood: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఇప్పుడు బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ తాప్సీ మొట్టమొదటిసారిగా నిర్మాతగా మారి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా సమంత కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ఈ గురువారం టెలికాస్ట్ కానుంది. దీంతో సమంత ఎపిసోడ్ కోసం ఆమె అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రోమోను రివీల్ చేశారు మేక‌ర్స్. ఈ షోకు సామ్‌ను మోసుకొచ్చాడు అక్షయ్‌ కుమార్‌. సమంతను అక్షయ్‌ ఎత్తుకుని సీటు దగ్గరకు తీసుకొచ్చి హంగామా చేశారు.

కరణ్‌ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానం చెబుతూ ఈ ఇద్దరు నవ్వులు పంచారు. ఈ క్రమంలోనే 'బ్యాచిలరేట్‌కి మీరు హోస్ట్‌ అయితే ఏ ఇద్దరు బాలీవుడ్‌ హీరోలను తీసుకుంటారు?' అని కరణ్‌ అడగ్గా 'రణ్‌వీర్‌సింగ్‌, రణ్‌వీర్‌సింగ్‌' అని సమంత మనసులో మాట బయటపెట్టారు. ఈ సమాధానం వినగానే 'ఓకే' అని అక్షయ్‌ చిరు నవ్వు చిందించారు. కరణ్‌ను ఉద్దేశిస్తూ 'అన్‌హ్యాపీ మ్యారేజ్‌కు మీరే కారణం' అని సమంత ఆరోపించారు. సామ్ విడాకుల అంశంతోపాటు రిలేష‌న్ షిప్స్ కు సంబంధించిన విష‌యాల గురించి ఈ షోలో మాట్లాడింది సామ్‌. ఈ ఎపిసోడ్‌ గురువారం సాయంత్రం 7 గంట‌ల‌కు హాట్ స్టార్ లో ప్రీమియ‌ర్ కానుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories