Kiran Abbavaram: తండ్రైన కిరణ్ అబ్బవరం..ఫొటో షేర్ చేసిన హీరో

Dhivi
Updated on: 23 May 2025 11:00 AM IST
kiran abbavaram blessed with child telugu news
X

Kiran Abbavaram: తండ్రైన కిరణ్ అబ్బవరం..ఫొటో షేర్ చేసిన హీరో

Kiran Abbavaram: టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం తండ్రి అయ్యారు. గురువారం తమకు బాబు పుట్టాడంటూ తెలిపారు. ఈ శుభవార్తను సోషల్ మీడియాలో వేదికగా తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఆయన షేర్ చేసిన ఫొటోలో బాబు కాలిని ముద్దాడుతూ కనిపించారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

నటి రహస్యను కిరణ్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రాజావారు రాణిగారులో కలిసి నటించారు. తర్వాత వివాహ బంధంతో గత ఏడాది ఒక్కటయ్యారు. క సినిమాతో కిరణ్ అబ్బవరం మంచి సక్సెస్ ను అందుకున్నారు. ప్రస్తుతం కె ర్యాంప్ మూవీలో నటిస్తున్నారు. జైన్స్ నాని ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.

Dhivi

Dhivi

Next Story