Viral Video: క‌ట్టుకున్న భార్య‌ను అలా వ‌దిలేస్తే ఎలా గురూ.. వైర‌ల్ అవుతోన్న వీడియో

Viral Video: క‌ట్టుకున్న భార్యకు జీవితాంతం తోడుగా ఉండాల‌ని చెబుతుంటారు.

Mokshith
Updated on: 21 May 2025 11:45 AM IST
Viral Video: క‌ట్టుకున్న భార్య‌ను అలా వ‌దిలేస్తే ఎలా గురూ.. వైర‌ల్ అవుతోన్న వీడియో
X

Viral Video: క‌ట్టుకున్న భార్య‌ను అలా వ‌దిలేస్తే ఎలా గురూ.. వైర‌ల్ అవుతోన్న వీడియో

Viral Video: క‌ట్టుకున్న భార్యకు జీవితాంతం తోడుగా ఉండాల‌ని చెబుతుంటారు. పెళ్లినాడు అగ్ని సాక్షిగా ప్ర‌మాణం కూడా చేయిస్తారు. అయితే ఓ వ్య‌క్తి మాత్రం క‌ట్టుకున్న భార్య‌ను ఉన్న‌ప‌లంగా రోడ్డుపై వ‌దిలేసి వెళ్లాడు. అయితే ఇది చూసిన జ‌నాలు న‌వ్వుకుంటున్నారు. భార్య‌ను వ‌దిలేస్తే న‌వ్వడం ఏంట‌ని అనుకుంటున్నారా.? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

నెట్టింట వైర‌ల్ అవుతోన్న వీడియోలో ఓ వ్యక్తి తన భార్య, బిడ్డతో కలిసి బైక్‌పై ప్రయాణిస్తుండగా ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. అతని ముందు సడెన్‌గా ఓ ట్రక్కు రావ‌డంతో బైక్ కాస్త డీవియేట్ అయ్యింది. అప్పటికే మధ్యలో కుమారుడిని కూర్చోబెట్టి, వెనక భార్యను పెట్టుకుని బైక్ నడుపుతున్న ఆ భర్తకు బైక్‌కి బ్యాలెన్స్ తప్పిన విష‌యం అర్థ‌మైంది. వెంట‌నే బైక్‌ను కంట్రోల్ చేశాడు.

అయితే అప్ప‌టికే వెన‌కాల కూర్చున్న భార్య కింద ప‌డిపోయింది. అయితే ఆ విష‌యం భ‌ర్త‌కు తెలియ‌లేదు. ఆగ‌కుండా వెళ్లిపోయాడు. వెన‌కాల వ‌స్తున్న ఓ వ్య‌క్తి దీనంత‌టినీ వీడియోలో బంధించాడు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైర‌ల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. క‌ట్టుకున్న భార్య‌ను ఇలా వ‌దిలేసి వెళ్తే ఎలా గురూ అంటూ కామెంట్లు చేస్తున్నారు.



Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story