తాను విజయ్ దేవరకొండ ఫ్యాన్ ని అంటున్న బాలీవుడ్ భామ

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' సినిమాలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల ను బాగానే మెప్పించింది.

Ruthvik
Published on: 4 Jan 2019 3:22 PM IST
kiara advani
X
kiara advani

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' సినిమాలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల ను బాగానే మెప్పించింది. ఇక రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న 'వినయ విధేయ రామ' సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. అలాగే ప్రస్తుతం దర్శకుడు సందీప్ రెడ్డి హిందీలో విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి' సినిమాను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో షాహిద్ కపూర్ సరసన కియారా అద్వానీ నే కనపడనుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు 'అర్జున్ రెడ్డి' సినిమా బాగా నచ్చేసిందని, విజయ్ దేవరకొండ కు పెద్ద ఫ్యాన్ అయిపోయానని చెప్పుకొచ్చింది. "తను ఒక అద్భుతమైన నటుడు. శాలిని పాండే కూడా చాలా బాగా నటించింది. విజయ్ మరియు శాలిని ఇద్దరు వారి పాత్రల్లో జీవించారు" అని చెప్పుకొచ్చింది. అలాగే ఈ సినిమాలో తాను ఒక పంజాబీ అమ్మాయిగా కనపడనుందని, దర్శకుడు హిందీ నేటివిటీకి సూటయ్యేలా కొన్ని మార్పులు చేశారని ఈ సినిమా న్యూ ఢిల్లీ బాక్ డ్రాప్ తో సాగుతుందని చెప్పింది.

Ruthvik

Ruthvik

Next Story