Kiara Advani: తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టనున్న బాలీవుడ్ బ్యూటీ

Kiara Advani: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితురాలే...

admin1
Updated on: 26 Dec 2021 12:53 PM IST
Kiara Advani Going to Announce Her Relationship with Sidharth Malhotra | Bollywood News Today
X

Kiara Advani: తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టనున్న బాలీవుడ్ బ్యూటీ

Kiara Advani: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితురాలే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన "భరత్ అనే నేను" సినిమా తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన కియరా రామ్ చరణ్ సరసన "వినయ విధేయ రామ" సినిమాలో కూడా నటించింది కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మారింది.

ఇక బాలీవుడ్ లో కబీర్ సింగ్, షేర్ షా వంటి సూపర్ హిట్ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న ఈమె ఇప్పుడు బాలీవుడ్ లోనే భారీ రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. అయితే గత కొంత కాలంగా కీయారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిదాకా వీరిద్దరు తమ ప్రేమ విషయాన్ని మీడియా ముందు ఒప్పుకోలేదు.

కానీ తాజాగా 2022 న్యూ ఇయర్ సందర్భంగా కియారా అద్వానీ మరియు సిద్ధార్థ్ మల్హోత్రా తమ ప్రేమని అఫీషియల్ గా ప్రకటన అని అనుకుంటున్నారట. తమ ప్రేమ విషయాన్ని అభిమానులకు తెలియజేస్తే బాగుంటుందని వీరిద్దరూ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు కియారా అద్వానీ, రామ్ చరణ్ సరసన శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేసింది.

admin1

admin1

Next Story