Khiladi Movie: జోరు మీదున్న రవితేజ.. 'ఖిలాడీ' రిలీజ్ డేట్ ఫిక్స్

మాస్ మహరాజా రవితేజ ఈ ఏడాది 'క్రాక్' మూవీ హిట్ తో జోరు మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో వరుస పెట్టి సినిమాలు చేసుకుంటు వెళ్తున్నారు.

Samba Siva Rao
Updated on: 31 Jan 2021 11:38 AM IST
Khiladi Movie: జోరు మీదున్న రవితేజ.. ఖిలాడీ రిలీజ్ డేట్ ఫిక్స్
X

Khiladi Movie Release Date: మాస్ మహరాజా రవితేజ ఈ ఏడాది 'క్రాక్' మూవీ హిట్ తో జోరు మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో వరుస పెట్టి సినిమాలు చేసుకుంటు వెళ్తున్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ తెరచుకోవడంతో.. 50 ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా? అనే సందేహాలకు పటాపంచలు చేస్తూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో అదరగొట్టింది. కాగా.. రవితేజ ప్రధానపాత్రలో రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకి చెందిన విడుదల చేసిన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాకు సంబంధించిన తాజా అప్ డేట్ ప్రటించారు. ఈ సినిమాను మే నెలలో విడుదల చేస్తున్నట్లు రవితేజ అధికారిక ట్విట్టర్ లో ప్రకటించారు. ఖిలాడి మే 28న థియేటర్లలో ప్రదర్శించబడుతోంది అని రవితేజ ట్వీట్ చేశారు.

'ఖిలాడి' పేరుతోనే మరరోసారి రవితేజ..తనదైన మాస్ యాక్షన్ ఎంటర్టేనర్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ఖిలాడి. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నాయికలుగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కట్టాడు.

మరోవైపు ప్రణీత ఈ చిత్రంలో ప్రత్యేక గీతంలో నర్తించనుందని సమాచారం. ఈసైకో థ్రిల్లర్ల్‌ని అంతే గ్రిప్పింగ్‌గా రీమేక్ చేసిన దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాకు దర్శకుడు. ఖిలాడీ చిత్రంలో మరోసారి రవితేజ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేయనున్నట్టు సమాచారం. ర‌వితేజ న‌టిస్తోన్న‌ 67వ సినిమా. ఇందులో ఆయ‌న ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. ఈ సినిమా డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ , బాలీవుడ్‌కి చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story