KGF 2: కేజీఎఫ్‌ 2 నటీనటుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

KGF Chapter 2 Actors Remuneration | Yash | Prashanth Neel | Live News
x

KGF 2: కే జి ఎఫ్ నటీనటుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Highlights

KGF 2: భారీ అంచనాల మధ్య విడుదలైన "కే జి ఎఫ్: చాప్టర్ 2" సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది...

KGF 2: భారీ అంచనాల మధ్య విడుదలైన "కే జి ఎఫ్: చాప్టర్ 2" సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అంచనాలకు మించిన కలెక్షన్లతో "కే జి ఎఫ్ చాప్టర్ 1" రికార్డులను తిరగరాస్తోంది ఈ సినిమా. కన్నడ, తెలుగు మాత్రమే కాక హిందీలో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కేవలం హిందీ లోనే ఈ సినిమా ఇప్పటి దాకా 268 కోట్లకు పైగా వసూలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే 720 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. అయితే తాజాగా ఈ సినిమాలో నటించిన నటీనటుల పారితోషికం గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాలో రాఖీ బాయ్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచిన యశ్ ఈ సినిమా కోసం 25 నుంచి 30 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమా కోసం 10 కోట్లు తీసుకోగా, రవీనాటాండన్ 2కోట్లు, హీరోయిన్గా నటించిన శ్రీనిధి శెట్టి 3 నుంచి 4 కోట్లు, సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్ 80 నుంచి 85 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారట. ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహించిన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం ఏకంగా 15 నుంచి 20 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories