భారత దేశాన్ని మెప్పించిన సినిమా ఇప్పుడు పాకిస్థాన్ కు వెళ్లనుంది

KGF
x
KGF
Highlights

ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కన్నడ సినిమా 'కేజీఎఫ్'. 200 కోట్ల దాకా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా త్వరలో మన పొరుగు దేశమైన పాకిస్థాన్ కు వెళ్ళడానికి సిద్ధమవుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కన్నడ సినిమా 'కేజీఎఫ్'. 200 కోట్ల దాకా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా త్వరలో మన పొరుగు దేశమైన పాకిస్థాన్ కు వెళ్ళడానికి సిద్ధమవుతోంది. లాహోర్ మరియు ఇష్లామాబాద్ ల్లో పలు మల్టీప్లెక్స్ ల్లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. సౌత్ లో భారీ విజయాన్ని అందుకున్న 'కేజీఎఫ్' హిందీ లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు పాక్ లో కాసుల వర్షం కురిపిస్తుందని ట్రేడ్ వర్గాల వారి అంచనా.

80 కోట్ల బడ్జెట్ తో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ కి బాహుబలి లాగా శాండల్ వుడ్ కి 'కేజీఎఫ్' అనేంత మంచి పేరు తీసుకొచ్చింది. భారీ అంచనాల మధ్య పలు భాషల్లో విడుదల అయిన ఈ సినిమా అన్నిట్లోనూ విజయ పధంలో ముందుకు సాగింది. తక్కువ రోజుల్లోనే, 200 కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయింది. పాకిస్థాన్ లో కూడా ఈ రేంజి వసూళ్లు రాబట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఈ సినిమా రెండవ పార్ట్ షూటింగ్ కు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories