Keerthy Suresh: కీర్తి.. సింగిలా? కమిటెడా?

Keerthy Suresh: నేను శైలజ సినిమాతో టాలీవుడ్ పరిచయమైంది హీరోయిన్ కీర్తి సురేష్. ఆ తర్వాత నాని హీరోగా నటించిన నేను లోకల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది..

Krishna
Updated on: 5 Nov 2020 3:45 PM IST
Keerthy Suresh: కీర్తి.. సింగిలా? కమిటెడా?
X

Keerthy Suresh on Twitter: నేను శైలజ సినిమాతో టాలీవుడ్ పరిచయమైంది హీరోయిన్ కీర్తి సురేష్. ఆ తర్వాత నాని హీరోగా నటించిన నేను లోకల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాలో అలనాటి తార సావిత్రి పాత్రను పోషించి అందరిచేత ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకి గాను జాతీయ అవార్డును సొంతం చేసుకుంది కీర్తి సురేష్.. ఇటివల పెంగ్విన్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన కీర్తి.. ఈ రోజు మిస్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమా ప్రమోషన్ లో భాగంగా అభిమానులతో చిట్ చాట్ చేసిన కీర్తి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

సమంత గురించి ఒక్క మాటలో..

సమంత గురించి ఒక్క మాటలో సరిపోదు.. వెరీ టాలెంటెడ్.. ప్రయోగాలు చేయడానికి భయపడదు..

సర్కారు వారీ పాటలో అవకాశం వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు?

చాలా సంతోషంగా ఉంది.. సినిమా షూటింగ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను..

మీకు ఇష్టమైన క్రికటర్ ఎవరు?

ధోని

లాక్ డౌన్ ఎం నేర్పించింది?

చిన్న చిన్న విషయాల్లోనూ సంతోషాన్ని వెతకడం.

బొద్దుగా ఉండే కీర్తి సురేశ్‌ను ఎప్పుడు చూస్తాం?

త్వరలోనే

జాతీయ అవార్డును అందుకుంటున్న సమయంలో ఎలా ఫీల్ అయ్యారు?

అది నమ్మలేని అనుభూతి..

కీర్తి సింగిలా? కమిటెడా?

నా వృత్తి పట్ల కమిటెడ్



Krishna

Krishna

Next Story