మరొక బయోపిక్ లో కీర్తి సురేష్

Ruthvik
Published on: 19 March 2019 6:35 PM IST
మరొక బయోపిక్ లో కీర్తి సురేష్
X

గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు స్కోప్ ఉన్న పాత్రలు ఎంచుకుంటూ తనదైన శైలిలో మంచి గుర్తింపును సాధించింది కీర్తి సురేష్. 'మహానటి' సినిమా తో స్టార్ హీరోయిన్ ల లీగ్ లో చేరిపోయిన ఈమె ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టనున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమా కాకుండా ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సరసన నటించే అవకాశం కీర్తి సురేష్ కి దక్కింది. ప్రస్తుతం ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో అజయ్ దేవగన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం కీర్తి సురేష్ కి దొరికింది.

'బధాయి హో' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అమిత్ శర్మ దీనికి దర్శకత్వం వహించనున్నారు. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్ర స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. కీర్తి సురేష్ మొత్తం రెండు వయస్సుల పాత్రలలో కనిపిస్తుందట. మొదట ఇబ్రహీం వయసులో ఉన్నప్పుడు తనను ప్రేమించే అమ్మాయి గా తరువాత 40కిపైబడ్డ మహిళగా ఆమె పాత్ర ఉంటుందట. 'మహానటి' లాగా నటనకు చాలా స్కోప్ ఉన్న పాత్ర అని తెలుస్తోంది. అందుకే ఇంతకంటే మంచి డెబ్యూ ఎవరికి దొరకదు అని కీర్తి సురేష్ ఈ సినిమాకు వెంటనే ఒప్పేసుకుందట.

Ruthvik

Ruthvik

Next Story