అలనాటి కీరవాణి 'జామురాతిరి'.. సరికొత్తగా పలకరిస్తోంది!

అలనాటి కీరవాణి జామురాతిరి.. సరికొత్తగా పలకరిస్తోంది!
x
Highlights

కొన్ని పాటలు వింటుంటే మనసు ఎక్కడికో పోతుంది. కొన్ని పాటలు కమ్మని జోలపాడతాయి. ప్రపంచాన్ని మర్చిపోయి హాయిగా సేదతీరేలా ఉంటాయి. అవే పాటల్ని ఎవరు ఎప్పుడు సరదాగా పాడినా సరే మన మనసుల్ని సేదతీర్చడం ఖాయం. అటువంటి పాటల్లో చెప్పుకోతగ్గ పాత జామురాతిరి...

కొన్ని పాటలు వింటుంటే మనసు ఎక్కడికో పోతుంది. కొన్ని పాటలు కమ్మని జోలపాడతాయి. ప్రపంచాన్ని మర్చిపోయి హాయిగా సేదతీరేలా ఉంటాయి. చాలా అరుదుగా మాత్రమే అటువంటి పాటలు వస్తాయి. అవి ఎన్ని సంవత్సరాలైనా నిత్యనూతనంగా ఉంటాయి. అవే పాటల్ని ఎవరు ఎప్పుడు సరదాగా పాడినా సరే మన మనసుల్ని సేదతీర్చడం ఖాయం. అటువంటి పాటల్లో చెప్పుకోతగ్గ పాత జామురాతిరి...

గుర్తుందా? క్షణ క్షణం సినిమాలో కీరవాణి సంగీతంలో వెలువడ్డ ఆ పాట. స్పష్టంగా వినిపించే సంగీతం.. అంతకన్నా స్పష్టంగా వినిపించే సాహిత్యం.. చెవుల్లో తేనె ధార పోసినట్టు.. గుండె చప్పుడుకి సప్తస్వరాల్ని లయబద్ధంగా మేలవిన్చినట్టు.. మెదడు పొరల్లో సన్నని మైకం కమ్మినట్టు.. అబ్బ ఇలా వర్ణిస్తూ పొతే సమయం చాలదు. ఇప్పుడెందుకు అకస్మాత్తుగా ఆ పాత గుర్తొచ్చిందనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నాను..

ఈపాటను తాజాగా మన నవ యువ గాయకులు మళ్లీ కొత్తగా పాడి వినిపించారు. కొత్తగా అన్నానని విపరీత పోకడలతో రీమిక్స్ అనుకోకండి. ఒరిజినల్ జామురాతిరి ఎంత హాయినిచ్చిందో అంతే హాయిని మనసుకు పంచింది ఈ పాట. జామురాతిరి అంటూ ఇప్పుడు ఈ పాటను మళ్లీ మనకు కొత్తగా వినిపించిన గాయకులు ఎవరో తెలుసా.. హేమచంద్ర, కాలభైరవ, మనీష, దీపూ, దామిని, మౌనిమ, శ్రుతి, నోయల్‌, పృథ్వీ చంద్రలు. ఇప్పుడు వీరు చేసిన ఈ స్వర ప్రయత్నం సాంఘిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతూ అందరినీ సేద తీరుస్తోంది. మీరూ ఓసారి చూసి సేదతీరండి...



Show Full Article
Print Article
More On
Next Story
More Stories