మహేష్‌తో సినిమాపై కత్రినా క్లారిటీ

Ruthvik
Published on: 31 Jan 2019 3:03 PM IST
మహేష్‌తో సినిమాపై కత్రినా క్లారిటీ
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఒక బాలీవుడ్ భామను రంగంలోకి దింపాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ సంప్రదించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ మధ్యనే మీడియాతో ముచ్చటిస్తూ కత్రినాకైఫ్ ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'భరత్' సినిమా తరువాత ఏ సినిమా ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది. అలాగే మహేష్ బాబు సినిమా గురించి తనకు ఎలాంటి ఆఫర్ ఇంకా రాలేదని తనను ఇంకా ఎవరూ అడగలేదని కుండబద్దలు కొట్టింది. ఇంతకుముందు వెంకటేష్ సరసన 'మల్లీశ్వరి' సినిమాలో మరియు బాలకృష్ణ 'అల్లరి పిడుగు' సినిమాలో నటించిన కత్రినాకైఫ్ మళ్లీ తెలుగులో ఎప్పుడు నటిస్తుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందేనేమో.

Ruthvik

Ruthvik

Next Story