రెండో సినిమాకి రెడీ అయిన 'ఆర్ ఎక్స్ 100' హీరో

Kartikeya
x
Kartikeya
Highlights

మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకోవడం అంత సులువైన విషయం కాదు. అతి కొద్దిమందికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది. అలాంటి కొద్దిమందిలో హీరో కార్తికేయ కూడా ఒకడు.

మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకోవడం అంత సులువైన విషయం కాదు. అతి కొద్దిమందికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది. అలాంటి కొద్దిమందిలో హీరో కార్తికేయ కూడా ఒకడు. 'ఆర్ఎక్స్ 100' సినిమా కార్తికేయ కెరీర్ ను పూర్తిగా మార్చేసిందని చెప్పుకోవచ్చు. బోల్డ్ సినిమా గా అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా బ్లాకె బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తో మరచిపోలేని హిట్ అందుకున్న కార్తికేయ ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నాడు.

ఇప్పటికే కార్తికేయ బోయపాటి శ్రీను శిష్యుడు అయిన అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఒక సినిమా ఓకే చేశాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఒంగోలు లో జరుగుతోంది. అనిల్ కుమార్ మరియు తిరుమలరెడ్డి సంయుక్తంగా జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ మరియు స్ప్రింట్ టెలి ఫిలిమ్స్ బ్యానర్లపై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ మరియు ఇతర సభ్యుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories