'దేవ్' సినిమా మళ్ళీ విడుదల కానుంది

దేవ్ సినిమా మళ్ళీ విడుదల కానుంది
x
Highlights

టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరో కార్తీ. గత ఏడాది 'చిన్న బాబు' సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయినప్పటికీ ఈ ఏడాది 'దేవ్' సినిమాతో...

టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరో కార్తీ. గత ఏడాది 'చిన్న బాబు' సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయినప్పటికీ ఈ ఏడాది 'దేవ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రొమాంటిక్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా గా ఈ నెల 14 న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ ను అందుకుంది. ఒకపక్క ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ నో అందుకుంటున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా నిర్మాతలకు నిరాశ మిగిల్చింది.

అయితే సినిమా ఫ్లాప్ అవడానికి గల కారణాల్లో కొందరు చెప్పే మాట చిత్రం నిడివి మూడు గంటలు ఉండటంతో ప్రేక్షకులు బోర్ గా ఫీలవుతారు అని. ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శక నిర్మాతలు సినిమాలోని 15 నిమిషాలు టైం తగ్గించారు. ఒకవేళ అది రిలీజ్ కు ముందే చేసి ఉంటే సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చి ఉండేదేమో తెలియదు కాని మరి ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories