నానితో కలిసి నటించనున్న 'ఆర్ఎక్స్ 100' హీరో

నానితో కలిసి నటించనున్న ఆర్ఎక్స్ 100 హీరో
x
Highlights

ఈమధ్యనే 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాసు' వంటి రెండు ఫ్లాప్ సినిమాలను చవిచూసిన నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'జెర్సీ' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు....

ఈమధ్యనే 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాసు' వంటి రెండు ఫ్లాప్ సినిమాలను చవిచూసిన నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'జెర్సీ' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో క్రికెటర్ పాత్రలో కనిపించనున్నాడు నాని. ఇక ఈ సినిమా పూర్తయిన తరువాత నాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక యంగ్ హీరో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

అజయ్ భూపతి దర్శకత్వంలో బోల్డ్ సినిమాగా తెరకెక్కిన 'ఆర్ఎక్స్ 100' సినిమాతో పాపులర్ అయిన కార్తికేయ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడు. ఈ పాత్ర గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గురించి బోలెడు పేర్లు బయటకు వచ్చాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. డార్లింగ్ స్వామి ఈ సినిమాకు మాటలు రచించారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'జెర్సీ' కి సంగీతాన్ని అందించిన అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు కూడా సంగీతాన్ని అందించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories