Kartikeya: విలన్ గా మళ్లీ ఫ్లాప్ అందుకున్న కార్తికేయ

Karthikey again Received the Flop as a Villain | Tollywood News
x

Kartikeya: విలన్ గా మళ్లీ ఫ్లాప్ అందుకున్న కార్తికేయ

Highlights

Kartikeya: విలన్ గా మళ్లీ ఫ్లాప్ అందుకున్న కార్తికేయ

Kartikeya: ఒకవైపు హీరోలుగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు హీరో కార్తికేయ గుమ్మకొండ. "ఆర్ఎక్స్ 100" సినిమా తో తనకంటూ ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ మంచి సినిమాలతో ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నారు. "90 ఎమ్మెల్", "చావు కబురు చల్లగా" వంటి సినిమాలలో కనిపించి మంచి హిట్స్ అందుకున్న కార్తికేయ 2019లో నాని హీరోగా నటించిన "గ్యాంగ్ లీడర్" సినిమా తో విలన్ గా మారారు. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది.

తాజాగా కార్తికేయ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా నటించిన "వలిమై" సినిమాలో విలన్ గా కనిపించారు. ఈ సినిమాతో కోలీవుడ్ లో కూడా అడుగు పెట్టాడు కార్తికేయ. భారీ అంచనాల మధ్య విడుదలైన అప్పటికీ ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కొన్ని సన్నివేశాల్లో అజిత్ పాత్ర కంటే కార్తికేయ పాత్ర హైలెట్గా నిలిచింది. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా ఈ సినిమా డిజాస్టర్ గా మారింది. తమిళ్ మరియు తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా రెండు భాషల్లోనూ డిజాస్టర్ గాని నిలిచింది. ఇలా కార్తికేయ విలన్గా రెండవ ఫ్లాప్ ని అందుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories