కార్తీకదీపం వంటలక్క బర్త్ డే.. సంబరాల్లో ఇంటిల్లపాదీ!

రాత్రి ఏడున్నర అయిందంటే చాలు తెలుగింట దాదాపు ప్రతి ఇంటిలోనూ కార్తీకదీపం మొదలవ్వల్సిందే!

K V D Varma
Published on: 2 Dec 2019 9:25 PM IST
కార్తీకదీపం వంటలక్క బర్త్ డే.. సంబరాల్లో ఇంటిల్లపాదీ!
X
karthika deepam serial actress premi vishwanath : Starmaa Image

రాత్రి ఏడున్నర అయిందంటే చాలు తెలుగింట దాదాపు ప్రతి ఇంటిలోనూ కార్తీకదీపం మొదలవ్వల్సిందే! అదేమిటి కార్తీకమాసం అయిపోయింది కదా ఇంకా కార్తీక దీపం ఏమిటనుకుంటున్నారా? ఇది మీరనుకుంటున్న కార్తీక దీపం కాదండీ.. స్టార్ మా లో వచ్చే సీరియల్ కార్తీక దీపం. ఎన్ని పనులున్నా సరే ఆ సమయానికి మహిళా మణులు వారికి తోడుగా ఇంటిల్లపాదినీ టీవీల ముందు కట్టిపాడేస్తోంది కార్తీకదీపం సీరియల్.

ఇక ఆ సీరియల్ ఆత్మాభిమానం ఉన్న ఆడపడుచుగా అందరి ప్రశంసలూ అందుకుంటోంది దీప. వంటలక్కగా ఈ నటీమణి ప్రేమీ విశ్వనాథ్ నటనకు అందరూ నీరాజనాలు పడుతున్నారు. ఈరోజు (02.12.2019) ఆమె పుట్టిన రోజు ఈ సందర్భంగా స్టార్ మా ఆమె కోసం ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. అంతేకాదు సోషల్ మీడియాలోనూ ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.


తన నటనతో కార్తీక దీపం సీరియల్ ను జాతీయ స్థాయిలో నెంబర్ 1 గా నిలబెట్టిన ప్రేమీ విశ్వనాథ్ కు తెలుగింట అభిమానులకు లెక్కలేదు. ఒక స్టార్ హీరోకు ఉన్నంత ఇమేజి సంపాదించిందీమె.

ఇక ఈమె పుట్టినరోజు సందర్భంగా ఆమె సోదరుడు ప్రత్యేకంగా పుట్టినరోజు వేడుకలు ఘనముగా నిర్వహించారు. ఈరోజు మొత్తం ప్రేమీ విశ్వనాథ్ పుట్టినరోజు వేడుకల కోలాహలంగా గడిచిపోయింది.


K V D Varma

K V D Varma

Next Story