karthika deepam : అంతా మీరే చేశారు..వంటలక్క విషయంలో డాక్టర్ బాబు ఫైర్!

karthika deepam : అంతా మీరే చేశారు..వంటలక్క విషయంలో డాక్టర్ బాబు ఫైర్!
x
an emotional scene from star maa karthika deepam serial
Highlights

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ తిరుగులేని టీఆర్పీ రేటింగ్ లతో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం. ప్రతిరోజూ కొత్త మలుపులతో.....

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ తిరుగులేని టీఆర్పీ రేటింగ్ లతో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం. ప్రతిరోజూ కొత్త మలుపులతో.. ఇంటిల్లపాదికి వినోదాన్ని పంచుతున్న కార్తీకదీపం సీరియల్ ఇప్పటి వరకూ 753 వ ఎపిసోడ్ కు చేరుకున్న కార్తీకదీపం సీరియల్ మరింత ఆసక్తి కరంగా మారింది. ఇల్లు వదిలి వెళ్ళిపోయిన దీప కోసం వెతుకులాటలో.. సౌర్యకు ఒక మహిళ యాక్సిడెంట్ లో మరణించిందని చెప్పడంతో.. కార్తీక్ ను మొదటి సారి నాన్నా అని పిలిచి షాక్ ఇస్తుంది. ఒక్క సారి మరణించింది అమ్మో కాదో చూసి చెబితే మళ్ళీ ఎప్పుడూ నువ్వు పిలవమనే దాకా నాన్న అని పిలవను డాక్టర్ బాబు అంటూ సౌర్య కోరుతుంది. దీంతో కార్తీక్ మార్చురీలో ఉన్న శవం ఎవరిదనేది పరిశీలించి.. అది దీప కాదు అని తెలుసుకుంటాడు. ఇదే విషయాన్ని సౌర్యకు చెబుతాడు. దీంతో సౌర్య సంతోషిస్తుంది. డాక్టర్ బాబు అమ్మ తిరిగొస్తుంది కదూ అని అడుగుతుంది. దీంతో కార్తీక్ మనసు కరిగిపోతుంది. ఇక ఈరోజు (11.03.2020) ఏం జరగబోతోందంటే..

కార్హ్తీక్, సౌర్యను తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు. దారిలో అతని మనసులో రకరకాల ఆలోచనలు. అప్పటివరకూ మరణించింది వంటలక్క కాకూడదని కోరుకున్న కార్తీక్ లో అప్పటినుంచి ఆమె పై కోపం పెరిగిపోతుంది. సౌర్యకు తానే తండ్రిని అని చెప్పి..చిన్న పిల్ల దృష్టిలో తనను చులకన చేసిందని మధన పడిపోతుంటాడు. ఈలోగా సౌర్య డాక్టర్ బాబు అమ్మ తిరిగి వస్తుందా అని అడగడంతో సౌర్య పై జాలి కలుగుతుంది. దాంతో పాటు దీప పై మరింత కోపం పెరిగిపోతుంది. సౌర్యను మొహం కడుక్కోమని చెప్పి.. అమ్మ తప్పకుండా దొరుకుతుందని ధైర్యం చెబుతాడు. ఈ క్రమంలో చిన్న పిల్లవి చిన్న పిల్లలా ఉండు అని సౌర్యకు చెబుతాడు కార్తీకి. దానికి ఆమె అమ్మకు ఎవరూ లేరు కదా డాక్టర్ బాబు. చిన్నప్పట్నుంచీ తనను నేను జాగ్రత్తగా చూసుకుతున్నాను. ఇప్పుడు అమ్మ లేకపోతె నేనేమైపోవాలి డాక్టర్ బాబు అని ప్రశ్నిస్తుంది.

ఇక సౌర్యను తీసుకుని ఇంటికి చేరిన కార్తీక్ ను చూసి సౌందర్య సంతోషిస్తుంది. సౌర్య పై కోపగించుకుంటుంది. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్లావు అంటూ అరుస్తుంది. సౌర్యను లోపలి వెళ్లి ఫ్రెష్ అవమని చెప్పిన కార్తీక్ తన తల్లి దండ్రుల తో మాట్లాడడం మొదలు పెడతాడు. అసలు మీరే ఇదంతా చేస్తున్నారు. నన్ను చిన్న పిల్ల దృష్టిలో దోషిగా నిలబెడుతున్నారు అంటూ నిలదీస్తాడు. చిన్న పిల్ల సౌర్య కు ఉన్న సంస్కారం, విజ్ఞత మీకు కానీ, మీ వంటలక్కకు కానీ లేవంటూ దేప్పిపోడుస్తాడు. జరిగిందంతా వివరంగా చెప్పి సౌర్య నన్ను నాన్న అని పిలిచి... మళ్ళీ డాక్టర్ బాబు అని పిలవడం గురించి చెబుతూ ఆ వయసులోనే ఆమె చూపించిన విజ్ఞత ను పొగుడుతాడు. అదే సమయంలో ఇటువంటి పిల్ల వంటలక్కలాంటి దాని కడుపునా ఎలా పుట్టింది అంటూ కోపగించుకుంటాడు. కార్తీక్ తల్లి సౌందర్య ఇప్పటికైనా అర్థం అవుతోందా సౌర్య నీ రక్తం అని అంటుంది. దాంతో కార్తీక్ మరింత ఫైర్ అవుతాడు. కేవలం చిన్న పిల్ల అని దాని పరినితికి దానికి వచ్చిన కష్టానికి నేను సపోర్ట్ చేస్తున్నాను అంతే. దీనిలో తనకి తండ్రిగా నేను ఎదో చేస్తున్నానని భావిస్తున్ననీ.. చిన్న పిల్ల పుట్ట్టుక గురించి నీచంగా ఆలోచిస్తున్న కుసంస్కారిననీ నన్ను ఎత్తి చూపే ప్రయత్నం చేయొద్దు అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు.

మొత్తమ్మీద ఈ రోజు పూర్తి సెంటిమెంట్ తో కార్తీక్ సౌర్య గురించి మాట్లాడిన మాటలతో ఎపిసోడ్ సాగిపోయింది. మరి దీప ఎక్కడుంది? అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది.

గతంలో జరిగిన కథ ఇదీ..

కార్తీక్, దీప భార్యాభర్తలు. వారిద్దరి అన్యోన్యత చెడగొట్టాలని అప్పటికే కార్తీక్ను ప్రేమించి దక్కిన్చుకోలేకపోయిన మౌనిత భావిస్తుంది. అందుకు కొన్ని ఎత్తుగడలు వేస్తుంది. దాంతో కార్తీక్, దీప విడిపోయి విడివిడిగా జీవిస్తుంటారు. వారికి ఇద్దరు కవల పిల్లలు. సౌర్య.. హిమ. విడివిడిగా ఉంటున్న కార్తీక్, దీపల దగ్గర చెరొక పాప ఉంటారు. సౌర్య తల్లి దగ్గర ఉంటె, హిమ తండ్రి దగ్గర ఉంటుంది. వంటలక్కగా అందరికీ వంటలు చేసి క్యారేజీలు పంపిస్తూ సౌర్యను చదివించుకుంటూ ఉంటుంది ఆత్మాభిమానం గల దీప. మరోవైపు డాక్టర్ బాబుగా కార్తీక్ హిమకు ఎ లోటూ లేకుండా చూసుకుంటాడు. చాలా కాలం బాగానే నడిచింది. అయితే, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాకా.. సమస్యలు మొదలవుతాయి. సౌర్య నాన్న ఎవరు అని అడిగితె, హిమ అమ్మ కావాలని మారం మొదలు పెడుతుంది. ఈ క్రమంలో సౌర్యకు నాన్న ఎవరో తెలుస్తుంది. కానీ, హిమ కు తల్లి ఎవరో తెలీదు. ఇక తన పుట్టినరోజుకు అమ్మను చూపించాలని కార్తీక్ ను హిమ కోరుతుంది. ఆమె ఒత్తిడిని భరించలేని కార్తీక్ చనిపోయిన తన పాత ప్రేయసి ఫోటోను చూపించి ఆమె హిమ తల్లి అని చెబుతాడు. దీంతో దీప హతాశురాలవుతుంది. పుట్టినరోజు పార్టీ నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి సౌర్య తన తల్లి వంటలక్క కోసం బాధపడుతూనే ఉంది. మరోవైపు కార్తీక్ మనసులో దీప మీద విషబీజాలు మరింత నాటడానికి మౌనిక ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటివరకూ జరిగింది ఇదీ..

ఇంటిల్లపాది మనసునూ దోచుకున్న కార్తీక దీపం సీరియల్ ప్రతిరోజూ స్టార్ మా టీవీలో వస్తోంది. అదేవిధంగా హాట్ స్టార్ లో ఈ సీరియల్ ఎపిసోడ్ లు అన్నీ అందుబాటులో ఉన్నాయి. అనుబంధాలు.. అనుమానాల మధ్య నలిగిపోయిన భార్యాభర్తలు.. విడివిడిగా ఉంటున్న తల్లి దండ్రుల మధ్య నలిగిపోతున్న పిల్లలు.. మంచిని చేడుగా మర్చాగలిగే చెప్పుడుమాటలు చేసే అపకారం అన్నిటినీ కలబోసి అందిస్తోంది కార్తీక దీపం. మానవ బంధాల మధ్య ఉండే సున్నిత విషయాలను చక్కగా చూపిస్తున్న కార్తీక దీపం సీరియల్ మీరూ మిస్ కాకుండా చూసి ఎంజాయ్ చేయండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories