Karthika Deepam: తిరిగొచ్చిన వంటలక్క.. చెంప పగలగొట్టిన కార్తీక్!

Karthika Deepam: తిరిగొచ్చిన వంటలక్క.. చెంప పగలగొట్టిన కార్తీక్!
x
a scene from karthika deepam (image:starmaa, hotstar)
Highlights

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ తిరుగులేని టీఆర్పీ రేటింగ్ లతో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం. ప్రతిరోజూ కొత్త మలుపులతో.....

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ తిరుగులేని టీఆర్పీ రేటింగ్ లతో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం. ప్రతిరోజూ కొత్త మలుపులతో.. ఇంటిల్లపాదికి వినోదాన్ని పంచుతున్న కార్తీకదీపం సీరియల్ ఇప్పటి వరకూ 754 వ ఎపిసోడ్ కు చేరుకున్న కార్తీకదీపం సీరియల్ మరింత ఆసక్తి కరంగా మారింది.

తిరిగొచ్చిన వంటలక్క!

అకస్మాత్తుగా మాయం అయిపోయిన వంటలక్క కోసం ఆమె కూతురు సౌర్య ఏడుస్తూనే ఉంది. ఆమె అత్తా సౌందర్య, మామ కూడా దీప ఏమైందనే టెన్షన్ ఒక వైపు.. నిన్న కార్తీక్ అన్న మాటలతో దీప తిరిగి వస్తే మరింత అసహ్యించుకుంటాడెమో అనే భయంతో మరోవైపు చర్చించుకుంటారు. సౌర్య కార్తీక్ ని నాన్న అని పిలిచి.. మళ్ళీ డాక్టర్ బాబు అని పిలవడం విషయం పై మాట్లాడుకుంటారు. ఇంత పరిణితి ఉన్న పిల్లకు ఇంత కష్టం ఎలా వచ్చిందని బాధ పడతారు. సౌర్య నిజంగా తాన కూతురే అని తెలిస్తే కార్తీక్ పరిస్థితి ఎలా ఉంటుందని అనుకుంటారు. ఇక సౌర్య ను పట్టుకుని పడుకున్న హిమ ను చూసి వంటలక్క కనిపించలేదని హిమ కూడా ఎంత ఆందోళన పడుతోందో.. అదే తల్లి ప్రేమ అంటే.. మనసులకు తెలిసిపోతుంది అని ఇద్దరూ అనుకుంటారు. కొద్ది సేపటికి సౌర్య అకస్మాత్తుగా నిద్ర లోంచి లేచి కార్తీక్ దగ్గరకు పరిగెడుతుంది. కార్తీక్ను డాక్టర్ బాబు అమ్మ గుర్తొస్తోంది. అమ్మ నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తోంది అంటూ ఏడుస్తుంది. ఆమెను ఊరడించి.. మీ అమ్మను వెతికి పట్టుకొచ్చే బాధ్యత నాది అని కార్హ్తీక్ అంటాడు. అయినా ఏడుస్తూ ఉన్న సౌర్యను బుజ్జగించి పడుకోపెదతాడు. మీ అమ్మ దొరకడం నీకెంత ముఖ్యమో నాకూ అంతే ముఖ్యం అని కోపంగా అనుకుంటాడు.

ఇక తెల్లారిన తరువాత సౌమ్య, హిమ వంటలక్కను వెదుకుతూ బయలు దేరతారు. ఇక్కడ ఇంటి దగ్గర సౌందర్య, ఆమె భర్తా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. సౌందర్య అప్పటికే దేవుని వద్ద చేరి.. ఒకసారి ఈ ఇంటి నుంచి నా కోడలు వెళ్ళిపోతే అత్తగారిగా వెతికి కలిశాను. ఆమె పరిస్థితికి తల్లిగా మారాను. ఇప్పుడు నా కూతురు ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అసలు నాకు ఈ పరీక్ష ఏమిటి అంటూ దేవునితో మొరపెట్టుకుంటుంది. ఈలోపు ఆమె భర్త గేటు వద్ద నిలుచుని ఎదురు చూస్తుంటాడు. సౌందర్య ఆయనను గేటు దాక వచ్చిన దీప ఇంట్లోకి రాదా మీ పిచ్చి కాకపోతేనూ అని అడుగుతుంది. కాదు.. గడప దాటినా మహాలక్ష్మి ఇంకా రాదేమో అని నిరాశ.. వస్తే బాగుండుననే ఆశ అంటూ సమాధానం ఇస్తాడు. ఈ లోపు అక్కడ అనుకోని సంఘటన జరుగుతుంది. వంటలక్కను కార్తీక్ ఈడ్చుకొచ్చి వారి ముందు తోసేస్తాడు. కింద పడిన దీపను చూసి సౌందర్య దంపతులిద్దరి కళ్ళలోనూ ఆనందం వస్తుంది. సౌందర్య పనిమనిషి మాలతిని పిలిచి దీపకు మంచి నీళ్ళు తమ్మంతుంది. దానికి కార్తీక్ అడ్డుపద్ఫతాడు. మాలతిని బయటకు వెళ్ళమని.. దీప ఎక్కడికి వెళ్లిందో నాకనవసరం. బాధ్యతా రాహిత్యంగా పిల్లను వదిలి పెట్టి ఎక్కడకు వెళ్ళిపోయింది? అసలు కావాలనే ఇలా చేసింది. ఎవరిని సాధిద్దామని ఇలా చేశావు.. అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ దగ్గరగా వెళతాడు. దీప నా కూతురు నాకూతురు అని పిచ్చి చూపులు చూస్తుంటుంది. ఈ లోపు అలా ప్రశ్నల వర్షం కురిపించిన కార్తీక్ ఆమె దగ్గరగా వెళ్లి చంప చెళ్ళు మనిపిస్తాడు. దీంతో దీపతో సహా అందరూ షాక్ అవుతారు.

మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ లో సెంటిమెంట్ తో కట్టి పాడేశారు. ముఖ్యంగా కార్తీక్..సౌర్యను ఒడార్స్తున్న సన్నీ వేషం టీవీ చూస్తున్న ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇక అందరూ దీప కోసం పడుతున్న ఆరాటం.. ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయిపొతుంది. దీప ప్రత్యక్షం కావడం.. కార్హ్తీక్ రియాక్షన్ చూసిన ప్రేక్షకులకు రేపటి ఎపిసోడ్ పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈరోజు సాయంత్రం మాటీవీలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ లో సన్నివేశాల్ని చూడండి.

గతంలో జరిగిన కథ ఇదీ..

కార్తీక్, దీప భార్యాభర్తలు. వారిద్దరి అన్యోన్యత చెడగొట్టాలని అప్పటికే కార్తీక్ను ప్రేమించి దక్కిన్చుకోలేకపోయిన మౌనిత భావిస్తుంది. అందుకు కొన్ని ఎత్తుగడలు వేస్తుంది. దాంతో కార్తీక్, దీప విడిపోయి విడివిడిగా జీవిస్తుంటారు. వారికి ఇద్దరు కవల పిల్లలు. సౌర్య.. హిమ. విడివిడిగా ఉంటున్న కార్తీక్, దీపల దగ్గర చెరొక పాప ఉంటారు. సౌర్య తల్లి దగ్గర ఉంటె, హిమ తండ్రి దగ్గర ఉంటుంది. వంటలక్కగా అందరికీ వంటలు చేసి క్యారేజీలు పంపిస్తూ సౌర్యను చదివించుకుంటూ ఉంటుంది ఆత్మాభిమానం గల దీప. మరోవైపు డాక్టర్ బాబుగా కార్తీక్ హిమకు ఎ లోటూ లేకుండా చూసుకుంటాడు. చాలా కాలం బాగానే నడిచింది. అయితే, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాకా.. సమస్యలు మొదలవుతాయి. సౌర్య నాన్న ఎవరు అని అడిగితె, హిమ అమ్మ కావాలని మారం మొదలు పెడుతుంది. ఈ క్రమంలో సౌర్యకు నాన్న ఎవరో తెలుస్తుంది. కానీ, హిమ కు తల్లి ఎవరో తెలీదు. ఇక తన పుట్టినరోజుకు అమ్మను చూపించాలని కార్తీక్ ను హిమ కోరుతుంది. ఆమె ఒత్తిడిని భరించలేని కార్తీక్ చనిపోయిన తన పాత ప్రేయసి ఫోటోను చూపించి ఆమె హిమ తల్లి అని చెబుతాడు. దీంతో దీప హతాశురాలవుతుంది. పుట్టినరోజు పార్టీ నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి సౌర్య తన తల్లి వంటలక్క కోసం బాధపడుతూనే ఉంది. మరోవైపు కార్తీక్ మనసులో దీప మీద విషబీజాలు మరింత నాటడానికి మౌనిక ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటివరకూ జరిగింది ఇదీ..

ఇంటిల్లపాది మనసునూ దోచుకున్న కార్తీక దీపం సీరియల్ ప్రతిరోజూ స్టార్ మా టీవీలో వస్తోంది. అదేవిధంగా హాట్ స్టార్ లో ఈ సీరియల్ ఎపిసోడ్ లు అన్నీ అందుబాటులో ఉన్నాయి. అనుబంధాలు.. అనుమానాల మధ్య నలిగిపోయిన భార్యాభర్తలు.. విడివిడిగా ఉంటున్న తల్లి దండ్రుల మధ్య నలిగిపోతున్న పిల్లలు.. మంచిని చేడుగా మర్చగలిగే చెప్పుడుమాటలు చేసే అపకారం అన్నిటినీ కలబోసి అందిస్తోంది కార్తీక దీపం. మానవ బంధాల మధ్య ఉండే సున్నిత విషయాలను చక్కగా చూపిస్తున్న కార్తీక దీపం సీరియల్ మీరూ మిస్ కాకుండా చూసి ఎంజాయ్ చేయండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories