Sultan: 'సుల్తాన్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

sulthan Movie Collections
x

సుల్తాన్ మూవీ ఫైల్ ఫోటో 

Highlights

Sultan: ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజే వసూళ్ల పరంగా సత్తాచాటింది.

Sultan: తమిళ నటుడు కార్తీ, ర‌ష్మిక మందాన్న హీరోహీరోయిన్లగా రూపొందిన చిత్రం 'సుల్తాన్'. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో శుక్రవారం(ఏప్రిల్ 2) విడుదలైంది. బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా జోనర్ లో రూపోందించారు. పల్లెటూరి అమ్మాయిగా రష్మిక మందాన్న ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్రభు సంయుక్తంగా నిర్మించారు. విడుదలకు ముందు నుంచే ఈ సినిమా సోషల్ మీడియాలో టాప్ ట్రెండిగ్ లో ఉంది.

ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజే వసూళ్ల పరంగా సత్తాచాటింది. ఒక్క తమిళం నుంచే రూ.8 కోట్లు వసూలు చేసింది. సినిమా టాక్ ఏలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల తర్వాత ఫస్ట్ వీకెండ్ వసూళ్లు చూస్తుంటే మాత్రం కార్తీ లక్ష్యానికి ఇంకా చాలా దూరంగానే ఉండిపోయాడని అర్థమవుతుంది. ఈ క్రమంలోనే 'సుల్తాన్' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పుడు ఈ సినిమా సేఫ్ కావాలంటే 6.5 కోట్ల షేర్ వసూలు చేయాలి.

నైజాం- 91 లక్షలు

సీడెడ్- 43 లక్షలు

ఉత్తరాంధ్ర- 31 లక్షలు

ఈస్ట్- 24 లక్షలు

వెస్ట్- 15 లక్షలు

గుంటూరు- 21 లక్షలు

కృష్ణా- 23 లక్షలు

నెల్లూరు- 12 లక్షలు

ఏపీ + తెలంగాణ - 2.60 కోట్లు

Show Full Article
Print Article
Next Story
More Stories