Karthi: సుల్తాన్ డే 1 కలెక్షన్స్..అక్కడ మాత్రం రికార్డు వసూళ్లు

Karthi Sultan Movie 1st Day Collections
x

సుల్తాన్ మూవీ ఫైల్ ఫోటో 

Highlights

Karthi: వసూళ్ల పరంగా సూల్తాన్ సృష్టించాడు.

Karthi: తమిళ నటుడు కార్తీ, ర‌ష్మిక మందాన్న హీరోహీరోయిన్లగా రూపొందిన చిత్రం 'సుల్తాన్'. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో శుక్రవారం(ఏప్రిల్ 2) విడుదలైంది. బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా జోనర్ లో రూపోందించారు. పల్లెటూరి అమ్మాయిగా రష్మిక మందాన్న ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్రభు సంయుక్తంగా నిర్మించారు. విడుదలకు ముందు నుంచే ఈ సినిమా సోషల్ మీడియాలో టాప్ ట్రెండిగ్ లో ఉంది.

ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజే వసూళ్ల పరంగా సత్తాచాటింది. ఒక్క తమిళం నుంచే రూ.8 కోట్లు వసూలు చేసింది. సినిమా టాక్ ఏలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో రూ.1.17 కోట్ల రూపాయలు రాబట్టినట్లు తెలుస్తోంది. గ్రాస్ 2.25 కోట్ల రూపాయలు సాధించిందని సమాచారం. ఖైదీ మూవీ సాధించిన కలెక్షన్లతో పోలీస్తే కాస్త తగ్గాయనే చెప్పాలి.

ఏరియాల వారిగా చూస్తే వసూళ్లు చూస్తే:

నైజాం:42 లక్షలు

సీడెడ్: 18 లక్షలు

యూఏ: 14 లక్షలు

ఈస్ట్ గోదావరి: 10లక్షలు

వెస్ట్ గోదావరి : 7.3 లక్షలు

గుంటూరు: 10 లక్షలు

కృష్ణా జిల్లా: 11.57 లక్షలు

నెల్లూరు :5.2 లక్షలు

ఏపీ, తెలంగాణ మొత్తం : 1.17 కోట్ల షేర్ ..2.25కోట్ల గ్రాస్ రాబట్టింది

Show Full Article
Print Article
Next Story
More Stories