Kareena Kapoor: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కరీనా కపూర్

Kareena Kapoor: ఈ రోజు ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కరీనా కపూర్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

Kranthi
Updated on: 21 Feb 2021 2:49 PM IST
Kareena Kapoor Gave Birth to a Baby Boy Today
X

ఇమేజ్ సోర్స్: పిటెరెస్ site

Kareena Kapoor New Baby: బాలీవుడ్ బ్యూటీ, అగ్రకథానాయిక, బేబో కరీనాకపూర్‌ మరోసారి తల్లయ్యారు. ఆదివారం ఆమె ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో కపూర్-ఖాన్‌ నివాసాల్లో వేడుకలు జరుగుతున్నాయి. తల్లీ బిడ్డా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. మరోవైపు కరీనా దంపతులకు సంబంధించిన చిత్రం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందులో పుత్రోత్సహంతో సైఫ్‌ కరీనా నుదిటిపై ముద్దు పెడుతూ కనిపించారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌తో ప్రేమలో పడిన కరీనా 2012లో ఆయనతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు.

ఈ దంపతులకు 2016లో తైమూర్‌ అలీఖాన్‌ జన్మించాడు. ఈ క్రమంలోనే తాను మరోసారి గర్భం దాల్చానని గతేడాది కరీనా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతానికి కరీనా.. ఆమిర్‌ఖాన్‌ సరసన 'లాల్‌ సింగ్‌ చద్దా'లో నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తాను ప్ర‌గ్నెంట్ అంటూ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసి అభిమానుల‌ని ఆనందింప‌జేసిన క‌రీనా కపూర్, ఆ స‌మ‌యంలోను షూటింగ్స్‌కు హాజ‌ర‌వుతూ మ‌ధ్య మ‌ధ్య‌లో యోగా‌సనాలు చేసింది. వాటికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.


Kranthi

Kranthi

Next Story