Karan Johar: పుష్ప గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కరణ్ జోహార్

Karan Johar: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొట్టమొదటి ప్యాన్ ఇండియన్ సినిమా "పుష్ప" డిసెంబర్ 17న విడుదలైంది.

admin1
Updated on: 30 Dec 2021 2:54 PM IST
Karan Johar Comments on Pushpa Movie in Bollywood | Telugu Latest News
X

Karan Johar: పుష్ప గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కరణ్ జోహార్

Karan Johar: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొట్టమొదటి ప్యాన్ ఇండియన్ సినిమా "పుష్ప" భారీ అంచనాల మధ్య డిసెంబర్ 17న విడుదలైంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. హిందీ లో మొదటి రోజు పుష్ప మూడు కోట్లు గడిచింది. హిందీలో బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు నమోదు చేసుకున్న సౌత్ ఇండియన్ సినిమాల జాబితా లో ఒకటిగా మారింది పుష్ప.

దీని గురించి ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "సౌత్ లో అల్లు అర్జున్ చాలా పెద్ద స్టార్ హీరో. కానీ తన పుష్ప సినిమా ఇక్కడ బాలీవుడ్ లో 3 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో ఓపెన్ అయింది. హిందీ లో పుష్ప సినిమాని ప్రమోట్ చేయడం కోసం కేవలం ఒక పోస్టర్ మాత్రమే విడుదల చేశారు.

కేవలం డిజిటల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ సినిమాకి ఉంది. అయినా సరే సినిమాని ప్రేక్షకులు చూశారు. ఎందుకంటే తన తెలుగు సినిమాలు అన్ని చాలా వరకు హిందీలో డబ్ అయ్యాయి" అని చెప్పుకొచ్చారు కరణ్ జోహార్. ఇక తెలుగు హిందీ భాషల్లో మాత్రమే కాక మిగతా భాషల నుంచి కూడా పుష్ప సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది.

admin1

admin1

Next Story