'మణి కర్ణిక' సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన క్రిష్

మణి కర్ణిక సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన క్రిష్
x
Highlights

'మ‌ణిక‌ర్ణిక'సినిమా విడుద‌లై మంచి వ‌సూళ్లు సాధిస్తోంది. అయితే ఈ సినిమా దర్శకత్వం చుట్టూ బోలెడు వివాదాలు ఉన్నాయి అని తెలిసిందే. ముఖ్యంగా ద‌ర్శ‌కుడు...

'మ‌ణిక‌ర్ణిక'సినిమా విడుద‌లై మంచి వ‌సూళ్లు సాధిస్తోంది. అయితే ఈ సినిమా దర్శకత్వం చుట్టూ బోలెడు వివాదాలు ఉన్నాయి అని తెలిసిందే. ముఖ్యంగా ద‌ర్శ‌కుడు క్రిష్ విష‌యంలో కంగ‌న ర‌నౌత్ ప్రవర్తించిన తీరు టాలీవుడ్ అభిమానులను సైతం బాధిస్తోంది. క్రిష్ దర్శకత్వంలోనే కంగన 'మణికర్ణిక' సినిమా లో నటించింది. గ‌తేడాది జూన్‌కే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయినప్పటికీ కంగనా కావాలని తన పాత్రకు ప్రాధాన్యత తెచ్చుకోవడం కోసం సినిమాలో చాలా మార్పులు తెచ్చిందని చెబుతున్నాడు క్రిష్.

"నేను సినిమా చూసాను. 70 శాతం కంటే ఎక్కువ సినిమాకు నేనే దర్శకత్వం వహించాను. సినిమా విడుదలకు ముందే మాట్లాడితే సినిమా కోసం పనిచేసిన వారి కష్టం వృధా అయిపోతుందేమో అన్న భయంతో మాట్లాడలేదు. కానీ ఇప్పుడు కూడా నేను నోరు విప్పకపోతే నా పనికి నేనే అవమానం చేసినట్టు అవుతుంది అందుకే మాట్లాడుతున్నాను. నేను దర్శకత్వం వహించిన మణికర్ణిక సినిమా బంగారం అయితే కంగనా దానిని వెండిలా మార్చింది" అంటూ ఆవేదన వెలిబుచ్చాడు దర్శకుడు క్రిష్. షూటింగ్ ఎప్పుడో పూర్తయి పోయినప్పటికీ తాను కావాలని తన పాత్రను హైలైట్ చేసుకోవడానికి మిగతా వారి పాత్రలను కట్ చేసిందని ఆరోపించారు క్రిష్.

Show Full Article
Print Article
Next Story
More Stories