'తలైవి' కొత్త లుక్ లో కంగనా!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తలైవి. కంగన ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నారు.

admin
Published on: 5 Dec 2020 4:10 PM IST
తలైవి కొత్త లుక్ లో కంగనా!
X

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తలైవి. కంగన ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 5న జయలలిత వర్థంతి సందర్భంగా ఆమెకు కంగనా నివాళులర్పించింది. మరో వారం రోజుల్లో తలైవి సినిమా పూర్తి కాబోతోందని కంగనా తెలిపింది.ఆరుసార్లు సీఎంగా సేవలదించిన జయలలిత పాత్రను తానూ చేయడం గౌరవంగా ఉందని పేర్కొంది. జయ అమ్మ వర్థంతి సందర్భంగా తలైవి సినిమాకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మరో వారం రోజుల్లో పూర్తి కాబోతోందని చిత్ర యూనిట్ పేర్కొంది. అటు జయలలితగా కంగన అద్భుతంగా కుదిరిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


admin

admin

Next Story