ఈసారి ఏకంగా వారినే టార్గెట్ చేసిన ఫైర్ బ్రాండ్

Kangana Ranaut: *హాలీవుడ్ వారు భారతీయ ఇతిహాసాలను కాపీ కొడుతున్నారు అంటున్న హీరోయిన్

Sriveni Erugu
Updated on: 15 May 2022 5:31 PM IST
Kangana Ranaut  shocking comments on Hollywood movies
X

హాలీవుడ్ సినిమాల పై షాకింగ్ కామెంట్స్ చేసిన కంగనారనౌత్

Kangana Ranaut: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ను అందరూ ఫైర్ బ్రాండ్ అని పిలుస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ తో ఈమె వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా కంగనా రనౌత్ తన తదుపరి సినిమా "ధకడ్" ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వస్తూ ఏదో ఒక వివాదాస్పద కామెంట్రీ చేసి వార్తల్లో నిలుస్తోంది ఈ భామ. ఈ మధ్యనే అమితాబచ్చన్ పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనారనౌత్ ఇప్పుడు హాలీవుడ్ సినిమాల పై కామెంట్ చేసింది. హాలీవుడ్ లో వచ్చిన సూపర్ హిట్ యాక్షన్ సినిమాలు మరియు సూపర్ హీరోల పాత్రలకి మన భారతీయ పురాణ ఇతిహాసాలు ఇతివృత్తం అంటూ చెప్పుకొచ్చింది కంగనా.

హాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమా ఆయన అవెంజర్స్ కి కూడా మహాభారతమే ఇన్స్పిరేషన్ అని ఆ సినిమాలోని పాత్రలు మరియు సన్నివేశాలు కూడా మహాభారతం లాగానే ఉంటాయని చెప్పిన కంగనా వారు మన ఇతిహాసాలను కాపీ కొడుతున్నారు అంటూ కామెంట్ చేసింది. ఐరన్ మాన్ ఆర్మర్ మహాభారతంలోని కర్ణుడి వద్ద ఉండే కవచకుండలాలు అని అన్నా కంగనారనౌత్ తోర్ పట్టుకునే ఆయుధం సుత్తి కూడా హనుమంతుడి వద్ద ఉండే గదలాగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇలా హాలీవుడ్ సినిమాలు భారతీయ ఇతిహాసాలను అపహాస్యం చేయటం బాధాకరం అని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది కంగనా.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story