Kangana Ranaut Says Heard Gunshots Near Home : కంగనా ఇంటివద్ద కాల్పుల కలకలం

Kangana Ranaut Says Heard Gunshots Near Home : బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇంటివద్ద శుక్రవారం అర్థరాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.

Krishna
Published on: 1 Aug 2020 10:47 PM IST
Kangana Ranaut Says Heard Gunshots Near Home : కంగనా ఇంటివద్ద కాల్పుల కలకలం
X
Kangana Ranaut(File Photo)

Kangana Ranaut Says Heard Gunshots Near Home : బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇంటివద్ద శుక్రవారం అర్థరాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మనాలీలోని తన ఇంటి వద్ద కాల్పుల శబ్దం వినబడడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. దీనిపైన ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనని విడుదల చేశారు. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు పెద్ద శబ్దం వినిపించిందని, వెంటానే తాను తన సెక్యూరిటీ ఇన్‌ఛార్జిని పిలిచినట్లుగా ఆమె అందులో పేర్కొన్నారు, పోలీసులు వచ్చినప్పుడు, ఆపిల్ తోటల నుండి గబ్బిలాలను భయపెట్టడానికి ఎవరైనా తుపాకీతో కాల్పులు జరిపినట్లుగా పోలీసులు అనుమానించారని ఆమె అందులో పేర్కొంది.

ఎనిమిది సెకన్ల వ్యవధిలోనే తానూ రెండు షాట్లను విన్నట్టుగా ఆమె వెల్లడించారు. తుపాకీ కాల్పులు ఎలా ఉంటాయో తనకు తెలుసని కంగనా అందులో పేర్కొన్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం తరువాత బాలీవుడ్ పైన పలు విమర్శలు గుప్పిస్తున్న కంగనా .. తాజాగా మహారాష్ట ముఖ్యమంత్రి కుమారుడు ఆదిత్య థాకరేని ఉద్దేశిస్తూ ''బేబీ పెంగ్విన్‌'' అంటూ ఆమె కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఆమె ఈ వాఖ్యలు చేసిన తరవాత ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆమె అభిమానుల్లో ఆందోళనను కలిగిస్తుంది. అయితే సుశాంత్ ను కూడా ఇలాగే భయపెట్టి ఉంటారని కానీ తాను భయపడేది లేదని ప్రశ్నిస్తూనే ఉంటానని కంగనా స్పష్టం చేసింది.

Krishna

Krishna

Next Story