బాలీవుడ్‌ పెద్దల పై కంగనా సంచలన వాఖ్యలు!

Kangana Ranaut : బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు స్పీడ్ అందుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే సీబీఐ సుశాంత్ స్నేహితుడు

Krishna
Published on: 27 Aug 2020 10:40 AM IST
బాలీవుడ్‌ పెద్దల పై కంగనా సంచలన వాఖ్యలు!
X

Kangana Ranaut

Kangana Ranaut : బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు స్పీడ్ అందుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే సీబీఐ సుశాంత్ స్నేహితుడు, సుశాంత్ పనిమనిషిలను విచారణ చేపట్టింది.. ఇక కేసు దర్యాప్తులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఎంట్రీపై హీరోయిన్ కంగనా రనౌత్‌ స్పందించారు. డ్రగ్‌ ముఠాలతో ఎన్‌సీబీ దర్యాప్తు చేపడితే బాలీవుడ్ పెద్దలు జైలుకి వెళ్ళడం ఖాయం అంటూ సంచలన ఆరోపణలు చేసింది. బాలీవుడ్‌ జనాలకు రక్త పరీక్షలు నిర్వహిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయని కంగనా ట్వీట్‌ చేశారు.

సుశాంత్ మరణం తర్వాత కంగన బాలీవుడ్ లోని ప్రముఖుల పైన పలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు ఆమె.. బాలీవుడ్‌లో ముఠా రాజకీయాలు, బయటి నుంచి వచ్చే హీరోలను అణగదొక్కుతున్నారని అంటూ ఆమె బహిరంగంగానే కామెంట్స్ చేశారు. తాజాగా సుశాంత్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న రియా చక్రవర్తికి డగ్స్ డీలర్స్‌తో సంబంధాలు వెలుగుచూడటం, దీనిపైన కంగనా రనౌత్‌ కామెంట్స్ చేయడంతో పెద్ద చర్చకి దారీ తీసింది.



ఇక సుశాంత్ విషయానికి వచ్చేసరికి జులై నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు.. అయితే అనే అతను ఆత్మహత్యను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఫ్యూచర్ స్టార్ గా మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలవరపరిచింది. అయితే సుశాంత్ కి ఆత్మహత్య కాదు హత్య అని వాదించే వారిలో కంగనా రనౌత్‌ ఒకరు..

Krishna

Krishna

Next Story