కమల్‌ హాసన్,‌ శశిథరూర్‌ పై బాలీవుడ్‌ నటి కంగనారనౌత్ ఘాటు వ్యాఖ్యలు

విలక్షణ నటుడు కమల్‌ హాసన్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌‌ పై బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌ మండిపడ్డారు.

Samba Siva Rao
Published on: 6 Jan 2021 5:32 PM IST
కమల్‌ హాసన్,‌ శశిథరూర్‌ పై బాలీవుడ్‌ నటి కంగనారనౌత్ ఘాటు వ్యాఖ్యలు
X

విలక్షణ నటుడు కమల్‌ హాసన్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌‌ పై బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌ మండిపడ్డారు. ప్రతి విషయాన్ని వ్యాపారంతో ముడిపెట్టి చూడొద్దని కంగనా హితవు పలికారు. కమల్‌హాసన్‌ ప్రజల్లోకి వెళ్లి తన పార్టీ మక్కల్‌ నీది మయ్యమ్‌ తరపున ప్రచారం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓ సభలో ఆయన మాట్లాడుతూ... తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ఇంటి పనిని కూడా వేతన వృత్తిగా గుర్తిస్తామని తెలిపారు. దీంతో కంగనా తనదైన శైలిల ట్విట్టర్‌ వేదికగా దయ్యబట్టారు. దీంతో కమల్ వ్యాఖ్యలపై కంగనా సీరియస్ అయ్యారు.

ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. "ప్రతి విషయాన్ని వ్యాపారంతో ముడిపెట్టి చూడకండి. మాతృత్వం గొప్ప వరం. అలాంటి మాతృత్వం కోసం అమితంగా ప్రేమించే వారితో శృంగారం చేయడాన్ని ఎలా వెల కడతారు. అలాగే ప్రతి ఇంటికి యజమని మహిళ. అలాంటి ఆమె చేసే పనికి మీరెలా వెల కడతారు? . మాకు కావాల్సింది జీతం రూపంలోని డబ్బులు కావు. గౌరవం, ప్రేమ. భగవంతుడి సృష్టికి డబ్బులు చెల్లించాలని అనే ఆలోచనను మార్చుకోండి"కంగనా రనౌత్ అని మండిపడ్డారు‌.

కమల్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ సమర్ధించారు. మంచి ఆలోచన అంటూ కొనియాడారు. సోషల్‌ మీడియాలో కంగనా రనౌత్‌ సామాజిక సమస్యలపై స్పందిస్తువుంటారు. ధోనీ సినిమా ఫేమ్ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతిలో బాలీవుడ్‌పై నిప్పులు చెరిగిన కంగనా.. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం పనితీరుని ఎండగడుతుంది. కంగనా రనౌత్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె జయలలితా ప్రాత్ర చేస్తున్నారు. ఈ సినిమాను రీసెంట్‌గా పూర్తి చేసి.. మిగిన సినిమాల చిత్రీకరణపై ఫోకస్ పెట్టారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story