క్రిష్ దర్శకత్వం పై షాకింగ్ కామెంట్స్ చేసిన కంగనా

Ruthvik
Published on: 27 Feb 2019 11:28 AM IST
క్రిష్ దర్శకత్వం పై షాకింగ్ కామెంట్స్ చేసిన కంగనా
X

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కి ఇప్పుడు దర్శకుడు క్రిష్ పై బోలెడు కామెంట్లు చేసే అవకాశం దొరికింది. కంగనా హీరోయిన్గా నటించిన 'మణికర్ణిక' సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కానీ క్రిష్ దర్శకత్వం వహించిన కొన్ని సీన్లు నచ్చక తానే దర్శకురాలిగా మారి చాలావరకు సీన్లు రీ షూట్ చేసింది. ఈ నేపథ్యంలో తాను దర్శకత్వం వహించిన 'మణికర్ణిక' సినిమా బంగారం అయితే దాన్ని కంగనా వెండి గా మార్చింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఇలాంటి కామెంట్లు చేసే వంతు కంగనాకు దక్కింది.

క్రిష్ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండు భాగాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ బాలకృష్ణ గారిని చూస్తే చాలా బాధగా ఉంది ఎంత నమ్మకంతో క్రిష్ కి ఈ సినిమా అప్ప చెప్పి ఎంతో కష్టపడ్డారు అంటూ సమాధానం ఇచ్చింది. అంతేకాక క్రిష్ పెయిడ్ మీడియా తో కలిసి 'మణికర్ణిక' సినిమా పై వేలెత్తి చూపాలని ప్రయత్నించాడని కానీ ఇప్పుడు అతని దర్శకత్వం వల్ల బాలకృష్ణ ఫుల్ అయ్యాడని చెప్పుకొచ్చింది.

Ruthvik

Ruthvik

Next Story