మళ్లీ రెచ్చిపోయిన కాంట్రవర్సీ క్వీన్ కంగనా

Arun Chilukuri
Published on: 16 Oct 2020 9:30 PM IST
మళ్లీ రెచ్చిపోయిన కాంట్రవర్సీ క్వీన్ కంగనా
X

ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ మళ్లీ రెచ్చిపోయింది. ఇప్పటికే బాలీవుడ్ మాఫియా అంటూ నానా రచ్చ చేసిన ఈ కర్లీ హెయిర్ బ్యూటీ ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీపై నిప్పులు చెరిగింది. ఇండియా సినిమా పరిశ్రమలో కళాకారులతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఉందంటూ ట్వీట్ చేసింది. బాలీవుడ్ అనే పదం హాలీవుడ్ నుండి కాపీకొట్టారని దయచేసి అవమానకరమైన బాలీవుడ్ పదాన్ని రిజెక్ట్ చేయండి అంటూ ఓ రెండు లైన్లు రాసుకొచ్చింది. అక్కడితో ఆగిందా అంటే ఇండియా రిజెక్ట్ బాలీవుడ్ అనే యాష్ ట్యాగ్ కూడా యాడ్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు హీట్ పుట్టిస్తోంది. అమ్మడి రాతల వెనక అర్థం ఏంటి మళ్లీ ఏం బాంబు పేల్చబోతుందంటూ ఒకటే డిస్కషన్ సోషల్ మీడియాలో !


Arun Chilukuri

Arun Chilukuri

Next Story