Vikram: కమల్ హాసన్ 'విక్రమ్' చిత్ర టీజర్ విడుదల అప్పుడేనా?

Kamal Haasan Vikram Movie Teaser Going to be Released Soon
x

కమల్ హాసన్ విక్రమ్ మూవీ (ఫైల్ ఇమేజ్)

Highlights

Vikram: త్వరలో విడుదల కాబోతున్న విక్రమ్ టీజర్

Vikram: ప్రస్తుతం కమల్ హాసన్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "విక్రమ్". త్వరలో ప్రేక్షులముందుకు రాబోతున్న ఈ సినిమాకి "ఖైదీ" మరియు "మాస్టర్" ఫేమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి మరియు మలయాళం స్టార్ నటుడు ఫాహద్ ఫాసిల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్, ఫాహాద్ ఫాసిల్ మరియు విజయ్ సేతుపతిని ఒకేసారి వెండితెర చూసేందుకు అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక అభిమానులు అందరూ ఈ చిత్ర టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీజర్ ను దీపావళి సందర్భంగా నవంబర్ 7న విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులందరూ టీజర్ తో కొంచెం క్లారిటీ వస్తుంది అని ఆశతో ఉన్నారు. పోస్టర్లు చూస్తేనే ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర మిగతా సినిమాలతో పోలిస్తే విభిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories