Kamal, Rajinikanth help to actor Ponnambalam: తమిళ నటుడు పొన్నాంబళన్‌ కి రజినీ, కమల్ ఆర్ధిక సహాయం!

Kamal, Rajinikanth help to actor Ponnambalam: తెలుగు తమిళ భాషలో విలన్ గా నటించి నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పొన్నాంబళన్‌ .. అయితే అయన కొద్దిరోజులుగా మూత్రపిండాలకి సంబంధించిన వ్యాధితో భాదపడుతున్నారు

Krishna
Published on: 11 July 2020 9:49 PM IST
Kamal, Rajinikanth help to actor Ponnambalam: తమిళ నటుడు పొన్నాంబళన్‌ కి రజినీ, కమల్ ఆర్ధిక సహాయం!
X
Kamal Haasan, Rajinikanth lends financial help to actor Ponnambalam

Kamal, Rajinikanth help to actor Ponnambalam: తెలుగు తమిళ భాషలో విలన్ గా నటించి నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పొన్నాంబళన్‌ .. అయితే అయన కొద్దిరోజులుగా మూత్రపిండాలకి సంబంధించిన వ్యాధితో భాదపడుతున్నారు. ఆ వ్యాధి మరింత తీవ్రం కావడంతో అయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి అక్కడ చికిత్స పొందుతున్నారు. అయితే చికిత్సకి సరిపోయే డబ్బులు అతని దగ్గర లేకుండా పోయాయి. ఈ క్రమంలో కోలివుడ్ నటులు పొన్నాంబళన్‌ కి సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

అందులో భాగంగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యక్తిగతంగా పొన్నాంబళన్‌తో ఫోన్ లో మాట్లాడి వైద్యానికి ఎంత ఖర్చు అయిన తానూ భరిస్తానని భరోసా ఇచ్చినట్టుగా రజనీ ప్రతినిధి రియాజ్‌ అహ్మద్‌ ఓ వార్తా సంస్థతో ఈ విషయాన్నీ వెల్లడించారు. అంతేకాకుండా పొన్నాంబళన్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్టుగా అయన వెల్లడించారు. ఇక విలక్షణ నటుడు కమల్ హసన్ పొన్నాంబళన్‌ పిల్లలకి అయ్యే ఖర్చుని తానే భరిస్తానని హామీ ఇచ్చినట్టుగా కోలివుడ్ మీడియా వర్గాలు తెలుపుతున్నాయి.

ఇక పొన్నాంబళన్‌ తమిళ చిత్ర పరిశ్రమలో స్టంట్ మాన్ గా అడుగుపెట్టి నటుడిగా మారాడు. ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ తో ముత్తు, అరుణాచలం అనే సినిమాలో కలిసి నటించాడు. ఇక కమల్‌తో అపూర్వ సగోదర్‌గళ్‌, మైకేల్‌ మదన కామరాజన్‌ చిత్రాల్లో కలిసి స్కీన్ షేర్ చేసుకున్నాడు. ఇక చివరిగా పొన్నాంబళన్‌ జయం రవి హీరోగా, ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో వచ్చిన కోమలి అనే సినిమాలో నటించాడు. అంతేకాకుండా కమల్ హాసన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ తమిళ రెండవ ఎడిషన్‌లో అతను ఇంటి సభ్యులలో ఒకడు. నటుడిగానే కాకుండా 2011 లో కూడా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు పొన్నాంబళన్‌ .

Krishna

Krishna

Next Story