పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైన 118 చిత్ర బృందం

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైన 118 చిత్ర బృందం
x
Highlights

ఈమధ్యనే 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలో హరికృష్ణ పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించిన నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇప్పుడు హీరోగా '118' సినిమాలో...

ఈమధ్యనే 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలో హరికృష్ణ పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించిన నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇప్పుడు హీరోగా '118' సినిమాలో కనిపించనున్నాడు. సినిమాటోగ్రాఫర్ కే. వి.గుహన్ ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రబృందం ఈ సినిమా నిర్మాణాంతర పనులలో నిమగ్నమైంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన పాత్రకు డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది.

ఈ సినిమాలో కొన్ని హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయని తెలుస్తోంది. వీటిలో భాగంగా ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకొని మరి ఒక అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ లో నటించారు కళ్యాణ్ రామ్. ఈ ఎపిసోడ్ సినిమా మొత్తానికే హైలైట్ గా మారుతుందని సమాచారం. శాలిని పాండే, నివేదా థామస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories