Kalyaan Dhev Kinnerasani: మూవీపై ఆసక్తిని రేకెత్తిస్తున్న 'కిన్నెర‌సాని' మోషన్ పోస్టర్..

Samba Siva Rao
Updated on: 11 Feb 2021 6:30 PM IST
Kalyaan Dhev Kinnerasani: మూవీపై ఆసక్తిని రేకెత్తిస్తున్న కిన్నెర‌సాని మోషన్ పోస్టర్..
X

‘కిన్నెర‌సాని’

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు క‌ళ్యాణ్ దేవ్ ప్రధాన పాత్రలో యంగ్ డైరెక్టర్ 'అశ్వథ్థామ' ఫేమ్ ర‌మ‌ణ తేజ దర్శకత్వంలో రూపొదుతున్న లెటెస్ట్ మూవీ 'కిన్నెరసాని'. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ గురువారం వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్‌కు, గ్లింప్స్ వీడియోకు అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ నేప‌థ్యంలో ఫిబ్రవ‌రి 11న హీరో క‌ళ్యాణ్ దేవ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా 'కిన్నెర‌సాని' చిత్రం బృందం ఓ మోష‌న్ పోస్టర్‌ని విడుద‌ల చేసింది.

కాగా..గురువారం విడుదల చేసిన మోష‌న్ పోస్టర్‌ వీపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రజనీ తాళ్లూరి, రవి చింతల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'క‌ల్కి' వంటి వైవిద్యభరిత చిత్రాలకు స్టోరీ అందించిన సాయితేజ్ ఈ మూవీకి కూడా కథను అందిస్తున్నారు. మ‌హ‌తి సాగ‌ర్ సంగీతం అందిస్తున్నాడు. కళ్యాణ్ దేవ్ మరో రెండు సినిమాలతో బీజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న 'సూపర్ మచ్చి' త్వరలోనే విడుదల కానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌లో చేస్తున్న కాగా.. మరొకటి ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో చేస్తున్న సినిమా.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story