ప్రొడ్యూసర్ గా మారబోతున్న కాజల్ అగర్వాల్

Ruthvik
Published on: 22 Feb 2019 1:45 PM IST
ప్రొడ్యూసర్ గా మారబోతున్న కాజల్ అగర్వాల్
X

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం స్టార్ హీరోస్ సరసన సినిమాలు తగ్గించేసి కుర్ర హీరోల సరసన రొమాన్స్ చేస్తుంది. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన "కవచం" సినిమాలో నటించిన కాజల్ అగర్వాల్ మళ్ళి అదే హీరోతో తేజ దర్శకత్వంలో "సీత" అనే సినిమాలో నటిస్తుంది. ఇక యంగ్ హీరో శర్వానంద్ తో సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా నటిస్తుంది కాజల్ అగర్వాల్.

ఇక ఈ రెండు సినిమాల తరువాత కాజల్ అగర్వాల్ తన సొంత ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసి సొంతంగా సినిమాలు ప్రొడ్యూస్ చేద్దాం అని అనుకుంటుంది. అయితే కాజల్ అగర్వాల్ ప్రొడక్షన్ లో వచ్చే తోలి సినిమాని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తాడు. "అ" సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ ఆ సినిమాలో కాజల్ కి మంచి పాత్రని ఇచ్చాడు. అందుకే కాజల్ అగర్వాల్ ఇప్పుడు ప్రశాంత్ వర్మ ని దర్శకుడిగా పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయనుంది. కాజల్ అగర్వాల్ తన ప్రొడక్షన్ హౌస్ కి కే.ఏ ప్రొడక్షన్స్ అని పేరు పెట్టింది. ప్రస్తుతానికి అయితే ప్రశాంత్ వర్మ "కల్కి" సినిమాతో బిజీగా ఉన్నాడు.

Ruthvik

Ruthvik

Next Story