స్పెయిన్లో చిందులేస్తున్న కాజల్, శర్వా

స్పెయిన్లో చిందులేస్తున్న కాజల్, శర్వా
x
Highlights

ఈమధ్యనే 'పడి పడి లేచే మనసు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ పెద్దగా మెప్పించలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలనే...

ఈమధ్యనే 'పడి పడి లేచే మనసు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ పెద్దగా మెప్పించలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలనే ప్లాన్ చేస్తున్న శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్పెయిన్ లో కొన్ని ప్రదేశాల్లో షూటింగ్ జరుగుతోంది.ఈ నేపథ్యంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరియు శర్వానంద్ తో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు.

ఈ పాట చిత్రీకరణ స్పెయిన్లోని వలెన్సియా లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఈ పాట కోసం 250 డాన్సర్లను తీసుకున్నారట. ఈ చిత్ర స్పెయిన్ షెడ్యూల్ మూడు వారాలు జరగనుంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా ఒక గ్యాంగ్స్టర్ డ్రామా అని సమాచారం అందుతుంది. 'హలో' బ్యూటీ కల్యాణీ ప్రియదర్శన్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. సితార ఎంటరైంమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో శర్వానంద్ సరికొత్త లుక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories