పంచదార బొమ్మ కాజల్ కు మైనపు బొమ్మ.. అదిరింది కదూ!
టాలీవుడ్ పంచదార బొమ్మ కాజల్ కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్ లోని మేడం టుస్సార్ మ్యూజియంలో ఆమె మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు. చందమామలా తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి రాజమౌళి మగదీరతో పంచదార బొమ్మలా ప్రేక్షకులను అలరించి.. అభిమానాన్ని సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ బుధవారం ఆమె తన మైనపు బొమ్మను ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన చిన్న తనాన్ని గుర్తు చేసుకున్నారు. ''నాకు 12 ఏళ్ల వయసులో ఈ మ్యూజియం కు వచ్చాను. ఆ అనుభూతి ఇంకా నన్ను అంటిపెట్టుకునే ఉంది. మహాత్మా గాంధీ విగ్రహం పక్కన నిలుచుని ఆయనను కలిసిన అన్భూతి పొందాను. బీటిల్స్ పక్కన కూచుని ఫోటోలు తీసుకున్నాను. అప్పుడు నాకు తెలీదు నాకు కూడా భవిష్యత్ లో ఇక్కడ స్థానం దొరుకుతుందని'' అని చెప్పుకొచ్చారు. ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజన్నారు.
కాజల్ ఇదే విషయాన్నీ తన సోషల్ మీడియా హ్యండిల్స్ లో షేర్ చేశారు.
Deeply humbled and ecstatic to be honoured, standing amongst global icons. Feels like I'm seeing
— Kajal Aggarwal (@MsKajalAggarwal) February 5, 2020
myself through the eyes of an artist 😍 The resemblance is uncanny and the attention to detail is spectacular. pic.twitter.com/WmOz38QBpSThank you @MTsSingapore for this wonderful recognition😊#MadameTussaudsSG #UltimateFilmStarExperience #KajalMadameTussauds #MadameTussaudsSingapore pic.twitter.com/9cKtjK4z2Y
— Kajal Aggarwal (@MsKajalAggarwal) February 5, 2020




