అల్లు అర్జున్ ''అల'' లో కాజల్ ఐటం సాంగ్..

అల్లు అర్జున్ అల లో కాజల్ ఐటం సాంగ్..
x
Highlights

టాలీవుడ్ లో ఐటం సాంగ్ లలో మెరుస్తూ ఉండే కాజల్ అగర్వాల్ మరో ఐటం సాంగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు...

టాలీవుడ్ లో ఐటం సాంగ్ లలో మెరుస్తూ ఉండే కాజల్ అగర్వాల్ మరో ఐటం సాంగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురంలో రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఒక ప్రత్యెక గీతం పెట్టాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ పాటలో అల్లు అర్జున్ తో ఆడేందుకు కాజల్ ని సంప్రదించారట. దానికి ఆమె కూడా అంగీకరించినట్టు టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఐటం సాంగ్ విషయంలో త్రివిక్రమ్, అల్లు అర్జున్ మధ్య తర్జన భర్జనలు జరిగినట్టు.. అల్లు అర్జున్ ఐటం సాంగ్ వద్దని చెప్పినట్టు కొన్నాళ్ళ క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు కాజల్ ఐటం సాంగ్ చేస్తున్నారని తెలుస్తున్డడంతో ఆ వివాదం సర్డుమనిగినట్టే అనిపిస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories