KP Chowdary: డ్రగ్స్‌ కేసులో కబాలి నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్

KP Chowdary: మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసుల పిటిషన్

Jyothi
Published on: 15 Jun 2023 7:15 AM IST
Kabali Producer KP Chowdary Arrested in Drugs Case
X

KP Chowdary: డ్రగ్స్‌ కేసులో కబాలి నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్

KP Chowdary: డ్రగ్స్ కేసులో ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ కావడంతో టాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి కేపీ చౌదరికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. 90 గ్రాముల కొకైన్ ను సెలబ్రెటీలకు అమ్మేందుకు తెచ్చినట్లు గుర్తించామని డీసీసీ తెలిపారు. అయితే అతని వద్ద డ్రగ్స్ ను కొనుగోలు చేసే వారి చిట్టాను సేకరిస్తామని డీసీపీ వెల్లడించారు. ఆయన గతంలో రజనీకాంత్ హీరోగా నటించిన కబాలి చిత్రానికి నిర్మాతగా ఉన్నారు. కేపీ చౌదరికి చాలా మంది సెలబ్రెటీలతో సంబంధాలు ఉన్నట్లు డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే ఆయనను మూడు రోజులు తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశామన్నారు.

Jyothi

Jyothi

Next Story