Jwala Gutta surprise to her boyfriend: ప్రియుడు బర్త్‌డేకి షాక్ ఇచ్చిన గుత్తా జ్వాల!

Jwala Gutta makes surprise to her boyfriend: ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల విజయాలతోనే కాకుండా వివాదాలతో కూడా వార్తల్లో నిలుస్తూ వస్తుంది. గుత్తా జ్వాల

Krishna
Published on: 17 July 2020 8:00 PM IST
Jwala Gutta surprise to her boyfriend: ప్రియుడు బర్త్‌డేకి షాక్ ఇచ్చిన గుత్తా జ్వాల!
X
Jwala Gutta surprise to Vishnu Vishal

Jwala Gutta makes surprise to her boyfriend: ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల విజయాలతోనే కాకుండా వివాదాలతో కూడా వార్తల్లో నిలుస్తూ వస్తుంది. గుత్తా జ్వాల తమిళ నటుడు విష్ణు విశాల్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. విశాల్ సోదరి సంగీత్ వేడుకలో వీరిద్దరికీ మొదటిసారి పరిచయం ఏర్పడగా ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇక ప్రస్తుతం డేటింగ్ లో ఉన్న వీరు త్వరలో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇక ఇది ఇలా ఉంటే ప్రియుడు విష్ణు విశాల్ బర్త్ డే కి ఉహించని షాక్ ఇచ్చింది గుత్తా జ్వాల.. జూలై17న విష్ణు విశాల్ బర్త్ డే సందర్భంగా హైదరాబాదులో ఉంటున్న గుత్తా జ్వాల చెన్నైలో ఉంటున్న నివాసానికి వెళ్లి పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. అక్కడ గుత్తా జ్వాలతో తీసుకున్న ఫొటోను విష్ణు విశాల్ ట్వీట్ చేశారు. అందులో కేక్ కట్ చేయించిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఇక అటు జ్వాల కూడా ట్విట్టర్ లో విష్ణుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్‌డే బేబీ' అనే క్యాప్షన్‌తో తమ సెల్ఫీని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



ఇక విష్ణు విశాల్ కి ఇప్పటికే పెళ్లిన సంగతి తెలిసిందే.. రజినీ నటరాజ్‌ ని 2011లో పెళ్లి చేసుకున్న విష్ణు ఏడేళ్ళ తరవాత అంటే 2018లో విడిపోయారు. ఈ దంపతులకి నాలుగేళ్ళు కుమారుడు కూడా ఉన్నాడు. ఇక అటు గుత్తా జ్వాల కూడా మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను 2005లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరవాత ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో 2011లో విడిపోయారు.

Krishna

Krishna

Next Story