Eid Wishes: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్

Eid Wishes: ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని.. త్వరలోనే నెగిటివ్ రిపోర్ట్ రావాలని కోరుకుంటున్నట్లుగా ఎన్టీఆర్ తెలిపారు.

Kranthi
Published on: 14 May 2021 12:14 PM IST
Jr.NTR Gives Eid Wishes
X

Jr.NTR Gives Eid Wishes:(File Image) 

Eid Wishes: రోజు రంజాన్ పర్వదినం కావడంతో ముస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని… త్వరలోనే కరోనా రిపోర్ట్ నెగిటివ్ రావాలని కోరుకుంటున్నట్లుగా ఎన్టీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ తోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా లీడ్ రోల్ లో నటిస్తుండగా.. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు వాయిదా పడింది.

ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిననపడ్డారు. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా చెప్పారు. ఎవ‌రూ కంగారు ప‌డాల్సిన ప‌నిలేద‌ని ప్రస్తుతం తాను బాగానే ఉన్నాన‌ని తార‌క్ తెలిపారు. త‌న‌తో పాటు కుటుంబ సభ్యులంద‌రూ హోమ్ ఐసోలేష‌న్ లో ఉన్నట్లు చెప్పారు. డాక్ట‌ర్ల ప‌ర్యవేక్షణలో ఉంటూ అన్ని కోవిడ్ నియ‌మ నిబంధ‌న‌లు పాటిస్తున్నట్లు చెప్పారు. దేశాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్.. సినీ ఇండస్ట్రీపై తీవ్రంగానే ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన ఎంతో మంది సినీ ప్రముఖులు పడిన సంగతి తెలిసిందే. ఇందులో పలువురు ప్రాణాలు సైతం పోగోట్టుకున్న విషయం తెలిసిందే.


Kranthi

Kranthi

Next Story